కురుసభలోని ద్రౌపది నుంచి కార్పొరేట్ మహిళ వరకు.. మగాడి కుర్చీ లాక్కోడమే FEMINISM aaa?
చీకటిలో ఉండడం అజ్ఞానం కాదు. ఆ చీకటి తనలోనే ఉందని తెలుసుకోలేకపోవడం అజ్ఞానం. జైలు గోడలకి రంగులేసినంత మాత్రాన అది ఇల్లు అయిపోదు, సంకెళ్లు మార్చుకున్నంత మాత్రాన స్వేచ్ఛ వచ్చినట్లు కాదు. మహాభారతంలో ద్రౌపది ఒక మహారాణి. ఆమెకు సమాజంలో అత్యున్నత హోదా ఉంది. ఐదుగురు మహావీరులు ఆమె భర్తలు. అంటే, నేటి పరిభాషలో చెప్పాలంటే ఆమెకు 'External Power' (బాహ్య అధికారం) ఉంది. కానీ కురుసభలో ఆమెను నిలబెట్టినప్పుడు, ఆ సభలో ఉన్న మగాళ్లందరూ (ధర్మరాజుతో సహా) ఆమెను కేవలం ఒక 'దేహంగా', ఒక 'ఆస్తిగా' మాత్రమే చూశారు. అధికారం ఉన్నా, హోదా ఉన్నా, పితృస్వామ్యపు చూపు ఆమెను ఒక వస్తువుగానే లెక్కగట్టింది. ఈరోజు చట్టసభల్లో కూర్చునే మహిళ అయినా, కార్పొరేట్ బోర్డు రూమ్‌లో కూర్చునే మహిళ అయినా ఎదుర్కొంటున్నది అదే కురుసభను. ఆమె తనకంటూ ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకోలేదు, మగాడు కట్టిన భవనంలోనే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కు మారింది అంతే. ఆట నియమాలు ఇంకా మగాడివే. గాయం యొక్క అనాటమీ (The Anat...