కష్టం ఒక భ్రమ: నీ శ్రమ అంతా Zero ఎందుకు అవుతోంది?
కష్టం ఒక భ్రమ: నువ్వు కష్టపడుతున్నావా లేక నీ భయానికి కాపలా కాస్తున్నావా? సమాజం, సోషల్ మీడియా, ఈ మోటివేషనల్ స్పీకర్లు, పాడ్‌కాస్ట్‌లు అన్నీ మనకు ఒకే మంత్రాన్ని నూరిపోస్తున్నాయి: "కష్టపడు, రక్తం చిందించు, విజయం సాధించు." ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. కానీ, ఎప్పుడైనా ఆగి నిన్ను నువ్వు ఒక ప్రశ్న వేసుకున్నావా? అసలు ఇంతలా కష్టపడి నువ్వు సాధిస్తున్నది ఏంటి? నిజం చెప్పాలంటే—నువ్వు అంతర్గతంగా ఏమీ సాధించడం లేదు. నువ్వు కేవలం ఒక illusion లో బతుకుతున్నావు. నీ శ్రమ అంతా సున్నా. ఈ మాట వినడానికి చేదుగా అనిపించవచ్చు, కానీ ఈ blog పూర్తయ్యే సరికి నీకదే అర్థమవుతుంది. ఇది సానుకూలతను పంచే అనూకూలమైన మాట కాదు, ఇది నీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా ప్రశ్నించే ఒక ప్రతికూలమైన, నిర్దాక్షిణ్యమైన సత్యం. భౌతిక శాస్త్రం, గ్రీకు పురాణాలు: అసలు 'పని' అంటే ఏమిటి? స్కూల్ లో Physics చదువుకుని ఉంటాం. అందులో 'Work' (పని) కి నిర్వచనం ఏమిటి? Work = Force × Displacement (బలం × విస్థాపనం). గ్రీకు పురాణాలలో సిసిఫస్ (Sisyphus) అనే రాజు కథ ఉంది. దేవుళ్లకి ...