నీ జీవితంలో ఉన్నవి Problems కావు, నీ చిల్లర కోరికలు.
ఉదయం లేవగానే ఒకటే నిరాశ, ఒకటే ఆందోళన. "నా జీవితంలో ఎందుకిన్ని Problems? నాకే ఎందుకిలా జరుగుతుంది? నేను ఎంత ప్రయత్నించినా ఈ మాయ నన్ను ఎందుకు కిందకు లాగుతోంది?" అని పదే పదే వాపోతున్నారా? నిజం చెప్పాలంటే, మీరు అడుగుతున్న ప్రశ్నలోనే ఒక పెద్ద అహంకారం, ఒక భయంకరమైన అజ్ఞానం దాగి ఉన్నాయి. మీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలకు మీరు ఇస్తున్న ప్రాముఖ్యత చూస్తే, అసలు మనిషిగా పుట్టినందుకు మీరే సిగ్గుపడాలి. లాజిక్ తో మాట్లాడదాం, కచ్చితమైన వాస్తవాలను చీల్చి చూద్దాం. మీ మెదడు మొద్దుబారిపోయిన కండిషనింగ్ ను పగలగొట్టే ప్రయత్నం ఇది. చదవడానికి కాస్త కఠినంగా అనిపించొచ్చు, కానీ సత్యం ఎప్పుడూ పూల పాన్పులా ఉండదు. 1. బౌన్సర్ పడితేనే కదా సిక్స్ కొట్టేది? మాయను నిందించడం ఆపండి. మాయ తన పని తాను చేస్తోంది, దాని మీద మీకు ఎందుకు అంత కక్ష? క్రికెట్ మైదానంలోకి దిగాక, బౌలర్ మీకు బంతిని Under arm తో, మీ కాలి దగ్గర నెమ్మదిగా దొర్లించుకుంటూ ఇవ్వాలా? అలా ఇస్తే అందులో thrill ఏముంది? అసలు అందులో మీ ప్రతిభ ఏముంది? Bouncer నేరుగా మీ ముఖం వైపు...