Arranged Marriage ఒక అశ్లీల సంత: The Dark Psychology of Relationships
Arranged Marriage: ఇదొక షరతులతో కూడిన అశ్లీల సంత సహజంగా జరిగిపోవాల్సిన దాన్ని అసాధ్యంగా మార్చేది ఎవరు? దాని పేరే 'Ego' (అహంకారం) . Ego అంటే ఇంకేదో కాదు, నీ belief system. నీ బుర్రలో నువ్వు సృష్టించుకున్న ఒక అబద్ధపు ప్రపంచం, ఒక fictitious self. Oxygen, Nitrogen గాలిలో ఎలా కలిసిపోతాయో, ఆడ-మగ అలా కలిసిపోవాలి. కానీ నీ అహంకారం అడ్డు వస్తుంది. నీకు అమ్మాయి కావాలి, కానీ ఎలా కావాలి? నా కులం అయి ఉండాలి. నా స్టేటస్ కి తగ్గట్టు ఉండాలి. తెల్లగా, గ్లామరస్ గా ఉండాలి. మన నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో ఉండే అత్యంత దారుణమైన కండిషన్: 'First-hand' అయి ఉండాలి (అంటే ఇంతకు ముందు ఎవరితోనూ రిలేషన్ ఉండకూడదు). ఆస్తి, ఆధిపత్యం మరియు 'First-hand' కండిషన్ వెనుక ఉన్న చరిత్ర అసలు ఈ మానసిక జబ్బు ఎక్కడ మొదలైందో చరిత్రలోకి వెళ్లి చూద్దాం. ఆదిమానవులుగా, వేటగాళ్లుగా (hunter-gatherer societies) బతికినప్పుడు మనిషికి ఆస్తి లేదు, కులం లేదు. సహజంగానే ఆడ, మగ కలిసేవాళ్లు. కానీ ఎప్పుడైతే మనిషి వ్యవసాయం (Ag...