Time Management స్కామ్: నువ్వు వృధా చేస్తున్నది కాలాన్ని కాదు, నీ బతుకుని!
సమయ నిర్వహణ (Time Management) అనేది శతాబ్దపు అతిపెద్ద స్కామ్: నీ అసలు రోగాన్ని దాచిపెట్టి, ముఖం మీది మొటిమలకు మందు రాస్తున్నావు. "సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి?" ఈ ప్రశ్న వినడానికి చాలా అమాయకంగా, ఎంతో బాధ్యతాయుతంగా అనిపిస్తుంది కదూ? కానీ నిజానికి ఇది మానవ అహంకారానికి, మూర్ఖత్వానికి పరాకాష్ట. ఈ ప్రశ్న అడిగే ప్రతివాడి అహంకారం వెనుక ఉన్న నమ్మకం ఏమిటో తెలుసా? "నాలో అంతా బాగుంది. నా బుద్ధి, నా ఆలోచనలు, నా జీవితం అద్భుతంగా ఉన్నాయి. నేను కేవలం ఈ 'టైమ్' అనే చిన్న విషయంలోనే కాస్త వెనుకబడ్డాను. ఆ టైమ్ ని ఎలా వాడాలో తెలిస్తే నేను దేవుడిని అయిపోతాను." ఇంతకంటే పెద్ద భ్రమ మరొకటి లేదు. నిన్ను నువ్వు ఒకసారి నిలదీసుకుని అడుగు. కాలాన్ని వృధా చేసేది ఎవరు? సమయమా? లేక నువ్వా? నువ్వు వృధా చేస్తున్నది కేవలం సమయాన్ని మాత్రమేనా? నీకు అందుబాటులో ఉన్న వనరుల్ని, నీకు ఎదురయ్యే అద్భుతమైన అవకాశాలని, చివరికి నీ జీవితాన్ని కూడా నువ్వు నాశనం చేసుకోవడం లేదా? అసలు సమస్య 'టైమ్' లో ఉందా? లేక దాన్ని వాడుతున్న 'నీలో ' ఉందా? దీన్ని ఒక ఉదాహరణతో విశ...