ది ట్రిలియన్ డాలర్ ఇల్యూజన్: నీ Insecurity నీది కాదు!
ఒక కాలు విరిగితే X-ray లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ కచ్చితంగా ఇక్కడే ఎముక ఫ్రాక్చర్ అయిందని వేలు పెట్టి చూపించగలడు. దానికి ప్లాస్టర్ వేస్తాడు, కొన్ని రోజుల్లో అది అతుక్కుంటుంది. అది ఫిజికల్ డ్యామేజ్. దానికి ఒక స్పష్టమైన ఎండ్ పాయింట్ ఉంది.
కానీ... ఆధునిక మానవుడికి పట్టిన ఒక భయంకరమైన జబ్బు ఉంది. దాన్ని ఏ X-ray పసిగట్టలేదు. ఏ MRI స్కాన్ దాన్ని గుర్తించలేదు. ఎందుకంటే ఆ జబ్బు నీ శరీరంలో లేదు, నీ సైకాలజీలో ఉంది. అదే... Insecurity (అభద్రతా భావం). ఇది కాలు విరగడం కంటే ప్రమాదకరమైనది, ఎందుకంటే ఇది నొప్పి తెలియకుండానే నిన్ను లోపలి నుండి తినేస్తుంది. నీ అస్తిత్వాన్నే విరిచేస్తుంది.
బానిసత్వాన్ని దాచిపెట్టే 'Ego'
ఈ మధ్య నువ్వేదైనా కొన్నావా? ఆలోచించు. Branded బట్టలు, ఏదైనా exotic perfume, ఒక కొత్త gym membership, రాత్రి పడుకునే ముందు రాసుకునే skin cream, లేదా కండలు పెంచడానికి protein powder... ఏదో ఒకటి. కొన్నావా? సరే.
ఇప్పుడు నిన్ను ఒక straight question అడుగుతాను. నీ Ego కి కొంచెం హర్ట్ అవ్వొచ్చు, అయినా అడుగుతాను. నువ్వు అది కొనాలి అని అనుకున్నప్పుడు, నీ బుర్రలో ఆ థాట్ ఎలా ప్లాంట్ అయింది? ఆ అసలైన ట్రిగ్గర్ పాయింట్ ఏంటి?
నువ్వు వెంటనే నీ Ego ని అడ్డుపెట్టుకుని, డిఫెండ్ చేసుకుంటూ చెప్పే సమాధానం నాకు తెలుసు: "నాకు నచ్చింది కాబట్టి కొన్నాను బ్రదర్" అని.
ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అబద్ధం!
నీకు నచ్చి కొన్నావా? ఆ 'నచ్చడం' (Liking) ఎక్కడి నుండి వచ్చింది? నీకు పుట్టుకతోనే branded shoes కావాలనో, సిక్స్ ప్యాక్ ఉండాలనో, fair skin కావాలనో కోరిక ఉందా? ఈ branded బట్టలు వేసుకోకపోతే నా బతుకు incomplete అన్న ఫీలింగ్ నీకు పుట్టుకతో రాలేదు. "నా దగ్గర అది లేకపోతే నేను తక్కువ, సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేయదు" అనే ఆ ఫీలింగ్ ఉందే... అసలు ఆ ఫీలింగ్ నీది కాదు!
Ego ఎప్పుడూ తన బానిసత్వాన్ని ఒప్పుకోదు. తానొక ప్రోగ్రామ్ చేయబడిన ప్రాడక్ట్ అని ఒప్పుకోవడానికి దానికి భయం. అందుకే ఆ manipulation ని 'నా ఛాయిస్' అని పేరు పెట్టి కవర్ చేసుకుంటుంది. కానీ పచ్చి నిజం ఏంటంటే... ఇదంతా చాలా కేర్‌ఫుల్‌గా నీ బ్రెయిన్‌లోకి ఒక పద్ధతి ప్రకారం ఇంజెక్ట్ చేయబడిన ఒక కమర్షియల్ ప్రొడక్ట్. నీకు తెలియకుండానే నీ Insecurity మీద, ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక సామ్రాజ్యం నడుస్తోంది.
నీ అశాంతి మీద బతికే 'ట్రిలియన్ డాలర్ల ఎకానమీ'
మరి దాన్ని నీ బుర్రలోకి ఇన్‌స్టాల్ (Install) చేసింది ఎవరు? దానికంటే ముందు మీక్కొన్ని numbers చూపించాలి.
- Global Beauty Industry: సుమారు 600 బిలియన్ డాలర్లు.
- Fitness Industry: 100 బిలియన్ డాలర్లు.
- Fast Fashion: 150 బిలియన్ డాలర్లు.
- Social Media Advertising Economy: వీటన్నిటినీ మన బ్రెయిన్‌లోకి నిరంతరం పంప్ చేసేది 200 బిలియన్ డాలర్లు.
అక్షరాలా ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ! కానీ, ఇంత భారీ సామ్రాజ్యం మొత్తం ఒకే ఒక్క ఫౌండేషన్ మీద నిలబడి ఉంది. ఆ పునాదేంటో తెలుసా?
"నువ్వు... నీకు నువ్వుగా సరిపోవు" (You are not enough).
నిరంతరం మనల్ని అసమర్థులుగా, అసంపూర్ణులుగా ఫీల్ అయ్యేలా చేసే ఒక Systemic design ఇది. ఇక్కడ మనిషి తనకి తానుగా ఛాయిస్ తీసుకుంటున్నాడు అనుకోవడం కేవలం ఒక ఇల్యూజన్ (Illusion). ఒకవేళ రేపు పొద్దున నువ్వు నిద్రలేచి, "నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, నాకు ఈ సొసైటీ వాలిడేషన్ (Validation) అక్కర్లేదు" అని genuinely ఫీల్ అయితే ఏమవుతుందో తెలుసా?
ఈ ఇండస్ట్రీస్ అన్నీ రాత్రికి రాత్రే కుప్పకూలిపోతాయి. ఆ బ్యూటీ క్యాంపెయిన్స్, ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్స్, ఆ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ అన్నీ రాత్రికి రాత్రే బ్యాంక్రప్ట్ (Bankrupt) అయిపోతాయి. అంటే దీని అర్థం ఏంటి? నీ Contentment (సంతృప్తి) వాళ్లకి ఒక Existential Threat. నీలో అశాంతి ఉంటేనే వాళ్ల అకౌంట్స్ లో బ్యాలెన్స్ పెరుగుతుంది.
The Peak of Capitalist Design: జబ్బుని సృష్టించేది వాళ్ళే, మందుని అమ్మేది వాళ్ళే
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? Dove soap commercial చూశావా? "Real Beauty" క్యాంపెయిన్ అంటారు. స్త్రీలు న్యాచురల్‌గా ఉండాలి, ఏ రంగులో ఉన్నా అందమే, బాడీ షేమింగ్ వద్దు అని చాలా ప్రోగ్రెసివ్‌గా చెప్తారు. చూసేవాళ్ళకి ఎంత పాజిటివ్‌గా, అద్భుతంగా అనిపిస్తుందో! కానీ... అదే Unilever company, skin ని తెల్లగా చేసే 'Fair & Lovely' (ఇప్పుడు Glow & Lovely) క్రీమ్స్ ని కూడా కరెక్ట్‌గా అదే టైంలో అమ్ముతుంది.
అంటే, ఒక పక్క నీలో ఉన్న న్యాచురల్ డ్రైవ్‌కి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూనే, మరో పక్క "నీ స్కిన్ డార్క్ గా ఉంది" అని నీకు Insecurity ని క్రియేట్ చేసి దానికి సొల్యూషన్ అమ్ముతారు. ఇది Contradiction కాదు. ఇది వాళ్ల బ్రూటల్ (Brutal) స్ట్రాటజీ! నీ Insecurity ని వాళ్ళే ఒక చేత్తో క్రియేట్ చేస్తారు, దానికి సొల్యూషన్ ని మరో చేత్తో వాళ్ళే అమ్ముతారు. ప్రాబ్లమ్, ప్రొడక్ట్ — రెండూ ఒకే సోర్స్ నుండి వస్తున్నాయి.
Attention Economy & The 'Comparison' Weapon
సరే, ఈ ఇండస్ట్రీస్ నీ దాకా ఎలా రీచ్ అవుతున్నాయి? ఇక్కడే Social Media Algorithm పిక్చర్ లోకి వస్తుంది. Instagram, YouTube, Facebook — వీటి అసలైన బిజినెస్ మోడల్ ఏంటి? Attention. నీ అటెన్షన్ ని అడ్వర్టైజర్స్ కి అమ్మడం. నువ్వు ఎంత ఎక్కువ టైం స్క్రోల్ చేస్తే, వాళ్లకి అంత రెవెన్యూ.
ఇప్పుడు నన్ను ఆన్సర్ చెయ్ — నిన్ను గంటల తరబడి స్క్రోల్ చేసేలా పట్టి ఉంచే కంటెంట్ ఏది? హ్యాపీగా ఉండే కంటెంట్ కాదు. ప్రశాంతతను ఇచ్చే కంటెంట్ అసలే కాదు. నిన్ను inadequacy (అసమర్థత) ఫీల్ అయ్యేలా చేసే కంటెంట్!
Attention Economy రీసెర్చ్ చాలా క్లియర్ గా చెప్తోంది: హ్యూమన్ బ్రెయిన్ ని హైజాక్ చేయాలంటే వాడాల్సిన ఏకైక వెపన్ 'Comparison' (పోలిక). కంపారిజన్ ట్రిగ్గర్ చేసే కంటెంట్ కి ఎంగేజ్మెంట్ మూడింతలు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆల్గారిథమ్, కావాలనే నీకంటే "better" గా బతుకుతున్నారు అనిపించే వాళ్ల ఫేక్ లైఫ్స్ ని నీ కళ్ల ముందు పెడుతుంది. పర్ఫెక్ట్ బాడీస్, లగ్జరీ వెకేషన్స్, సక్సెస్ ఫుల్ కెరీర్స్, ఫిల్టర్ చేసిన ముఖాలు. ఇది నిరంతరం నీతో నీకు ఒక Invisible Comparison చేయిస్తుంది.
నువ్వు జస్ట్ క్యాజువల్ గా స్క్రోల్ చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ వాస్తవానికి మీరు ఏ పోస్ట్ దగ్గర ఎన్ని మిల్లీ సెకండ్లు ఆపారు, ఏ ఇమేజ్ చూస్తే మీ హార్ట్ రేట్ పెరుగుతుంది అనే ట్రిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్‌ని AI నిరంతరం ప్రాసెస్ చేస్తోంది.
The Unending Loop of FOMO
మరి ఆ లూప్ లోంచి బయటపడాలంటే? ఆప్షన్ లేదు. దానికి సొల్యూషన్ కూడా వాళ్లే రెడీగా పెట్టారు. ఈ ట్రాప్ ఎలా ఉంటుందంటే...
- ఎవరిదో పర్ఫెక్ట్ బాడీ లేదా ఫేక్ లైఫ్‌స్టైల్ చూస్తారు.
- వెంటనే మీలో ఒక యాంగ్జైటీ (Anxiety) వస్తుంది.
- "వాళ్ళలా నేను కూడా అవ్వాలి, నా లైఫ్ వేస్ట్" అనే thought trigger అవుద్ది.
- కరెక్ట్‌గా అదే టైంకి నీకొక Ad వస్తుంది. (Weight loss supplement, skin care routine, etc.)
- దాన్ని ఫాలో అయ్యి పర్చేజ్ చేస్తారు — కొద్దిసేపు ఒక టెంపరరీ రిలీఫ్.
- మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్!
ఈ లూప్‌లో ఎగ్జిట్ లేదు. నువ్వు కంటెంట్ ని Consume చేస్తున్నాను అనుకుంటున్నావు గానీ, అసలక్కడ Consume అవుతున్నది నువ్వే అని నీకు తెలియట్లేదు. దీనంతటికీ ఫ్యూయల్ లా (Fuel) పనిచేసేది FOMO — Fear Of Missing Out.
The Bitter Truth: నువ్వు Victim కాదు, Willing Participant వి!
See... నీ Insecurity నీ వీక్ నెస్ (Weakness) కాదు. ఎందుకంటే అసలు అది నీదే కాదు. అయితే, ఇదంతా విన్న నువ్వు, ఇక్కడే ఒక అతిపెద్ద ట్రాప్ లో పడతావు. అదేంటంటే... "అవునూ.. ఇందులో నా తప్పు ఏముంది? ఇదంతా సిస్టమ్ తప్పు కదా" అని నువ్వు చాలా కంఫర్టబుల్ గా తప్పించుకోవడానికి ట్రై చేస్తావు. ఎందుకంటే Victim position లో ఉండటం Ego కి ఎప్పుడూ ఒక ఫేక్ రిలీఫ్ ని ఇస్తుంది.
కానీ విను. ఈ మానిప్యులేషన్ (Manipulation) జరుగుతోంది అని తెలిసిన తర్వాత కూడా, ఇది మన మానసిక బలహీనత మీద ఆడుతున్న గేమ్ అని తెలిసాక కూడా, నువ్వు అదే లూప్ లో ఉంటే — అప్పటి నుండి అది వంద శాతం నీ తప్పే!
ఆ సిస్టమ్ ని డిజైన్ చేసింది వాళ్లే కావచ్చు. కానీ రోజూ ఉదయం లేచి ఆ యాప్ ఓపెన్ చేస్తున్నది నువ్వు. రోజూ ఆ ఇల్యూజన్ (Illusion) తో నిన్ను నువ్వు కంపేర్ చేసుకుంటున్నది నువ్వు. నీ క్రెడిట్ కార్డ్ తీసి ఆ పర్చేజ్ చేస్తున్నది నువ్వు. నిజం తెలిసిన తర్వాత కూడా సేమ్ బిహేవియర్ రిపీట్ చేస్తే — నువ్వు Victim కాదు. నువ్వు ఒక Willing Participant వి!
The Ultimate Rebellion: Unconditional Self-Acceptance
సిస్టమ్ ఒక అదృశ్యమైన విషవాయువును గాలిలో వదిలింది. ఆ పాయిజన్ పీల్చడం ఫస్ట్ టైమ్ సిస్టమ్ ఫాల్ట్ కావచ్చు, మన బయోలాజికల్ వల్నరబిలిటీ కావచ్చు. కానీ మీకు ఆ పాయిజన్ ఉందని తెలిసాక, మీ చేతిలో 'డిజిటల్ మినిమలిజం', 'సెల్ఫ్ యాక్సెప్టెన్స్' అనే గ్యాస్ మాస్క్ ఉన్నాక కూడా మీరు దాన్ని వాడట్లేదు అంటే అర్థం ఏంటి?
సిస్టమ్ క్రూరంగా ఉంది, నన్ను మానిప్యులేట్ చేస్తోంది అని నిందించడం మానేయండి. వాతావరణం కలుషితమైనప్పుడు ఊపిరి పీల్చుకునే పద్ధతులను మార్చుకుని మనల్ని మనం రక్షించుకోవాలి. ఈ ఇన్‌సెక్యూరిటీ బిజినెస్ అనేది మానవ బలహీనతలను పెట్టుబడిగా మార్చుకున్న ఒక పర్ఫెక్ట్ క్యాపిటలిస్ట్ అడిక్షన్ లూప్.
దీనికి వ్యతిరేకంగా మీరు చేయగలిగే అతిపెద్ద Rebellion (తిరుగుబాటు) ఒకటే...
Unconditional Self-Acceptance: "నేను ఉన్నది ఉన్నట్లుగా పూర్తిగా సరిపోతాను" అని అంగీకరించడం.
మనం బాధితులం కాదు, కళ్ళు తెరిచి నడుస్తున్న ఇష్టపూర్వక భాగస్వాములం. మన ఛాయిస్‌ని మనం ఎప్పుడైతే ఓన్ (Own) చేసుకుంటామో అప్పుడే ఈ పద్మవ్యూహం నుండి బయటపడతాం. రేపు ఉదయం మీరు నిద్రలేచి, నిన్ను నువ్వు పూర్తిగా, ఎటువంటి కండిషన్స్ లేకుండా యాక్సెప్ట్ (Accept) చేసుకుంటే.. మీ బాడీని, మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ని, మీ జీవితాన్ని, ఉన్నది ఉన్నట్టుగా, మీ లోపాలను ఎటువంటి కండిషన్స్ లేకుండా పూర్తిగా యాక్సెప్ట్ చేసుకుంటే...
"నువ్వు సరిపోవు" అనే Insecurity ని నీలో ఇంజెక్ట్ చేసి, నమ్మించి, నీకవసరం లేని వాడి ప్రొడక్ట్ ని ఎవడైనా నీకండగట్టగలడా? ఆలోచించు.
-PRATIKULA VEDAM
Comments
Post a Comment