"నీ కోసం Sacrifice చేశాం" — ఈ ఒక్క Sentence తో నీ Life ని ఎలా Control చేస్తున్నారో తెలుసా?

తల్లిదండ్రుల Unconditional Love. ఇదొక పెద్ద TRAP

నిన్నొక సింపుల్ question అడుగుతాను. నీ జీవితంలో, నీ సొంత ఇంట్లో, నీ చెవులతో ఈ డైలాగ్ ఎన్నిసార్లు విన్నావు?

"నీ కోసం మా జీవితాన్ని sacrifice చేశాం. మా కోరికలన్నీ చంపుకుని నిన్ను పెంచాం. మా జీవితాలను నీ కోసమే అంకితం చేసేశాం."

విన్నావు కదా? కచ్చితంగా వినే ఉంటావు.

ఇప్పుడు ఒక నిమిషం ఆగి, నీ లోపల నువ్వు చెక్ చేసుకో. ఆ మాట విన్నప్పుడు నీ మెదడులో ఏం జరిగింది? నీకు నిజంగా ఏమనిపించింది?

"అబ్బా, నా parents నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు!" అని ఆనందంతో నీ గుండె ఉప్పొంగిందా?

లేక... నీ గొంతులో ఏదో అడ్డుపడినట్టు, భుజాల మీద ఒక పెద్ద బండరాయి పెట్టినట్టు... ఒక పచ్చి Guilt నీ లోపల పాకిందా? 'అయ్యో, వీళ్ళు నా కోసం ఇంత చేశారు, నేను వీళ్ళకి రుణ పడిపోయాను' అనే ఒక భయం వేసిందా?

ఒక్కసారి logically ఆలోచించు.

ఒక మనిషి నిన్ను నిజంగా ప్రేమిస్తే, నీకు భయం ఎందుకు వేస్తుంది? నీకు guilt ఎందుకు వస్తుంది? ఎందుకంటే... నీకు చెప్పబడిన ఆ మాటల్లో ప్రేమ లేదు. అక్కడ ఉన్నది ఒక పక్కా వ్యాపారం. ముసుగు వేసుకున్న ఒక Transaction. Love కి, Guilt కి మధ్య ఉన్న తేడా తెలియని మూర్ఖపు సమాజంలో మనం బతుకుతున్నాం. ఆ తేడా నీకు అర్థమైన క్షణం, నీ జీవితం ఇప్పటిదాకా ఒక అబద్ధం మీద ఎలా నిర్మించబడిందో నీకు అర్థమవుతుంది. ఆ నిజం తట్టుకోవడం కష్టం. కానీ విను.

1. THE ORIGINAL CHOICE: అసలు నిన్ను భూమి మీదకు తెచ్చింది ఎవరు?

అసలు ఈ 'Sacrifice' అనే concept ఎక్కడి నుండి వచ్చింది? దీన్ని ముక్కలు ముక్కలుగా కోసి చూద్దాం.

నిన్ను ఈ భూమి మీదకు తీసుకురావాలి అనేది ఎవరి choice?

నువ్వు ఏమైనా పైన దేవుడి దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నావా? "అయ్యా, నన్ను కిందకు పంపించండి, నేను మా నాన్న కట్టిన ఫీజులకి వడ్డీతో సహా నా జీవితాన్ని రాసిచ్చేస్తాను" అని ఏమైనా agreement మీద sign చేశావా?

లేదు కదా!

పిల్లలని కనడం అనేది పక్కాగా వాళ్ళ Choice. అది వాళ్ళ biological అవసరం. సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు కోసం, ఒక status కోసం, వాళ్ళ మురిపం కోసం, లేదా రేపు ముసలితనంలో వాళ్ళని చూసుకోవడానికి ఒక insurance policy లాగా... వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకున్న ఒక ఏర్పాటు. ఇది పచ్చి నిజం.

ఒక choice వాళ్ళు తీసుకున్నప్పుడు, ఆ choice కి సంబంధించిన consequences ని భరించడం అనేది వాళ్ళ Responsibility (బాధ్యత). అది వాళ్ళ డ్యూటీ.

నువ్వు ఒక కుక్కపిల్లని ఆశపడి ఇంటికి తెచ్చుకుని, దానికి రోజూ రెండు పూటలా అన్నం పెడుతూ... "నీ కోసం నా అన్నం త్యాగం చేశాను" అని దాన్ని రోజూ టార్చర్ పెడితే ఎలా ఉంటుందో, ఈ 'sacrifice' డైలాగ్ కూడా ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటుంది.

బాధ్యతను 'త్యాగం' అని పేరు మార్చి, నీ మెదడులోకి ఎక్కిస్తున్నారు. ఎందుకు?

2. THE CONVERSION INTO DEBT: వ్యాపారానికి వేసిన ముసుగు

సమస్య ఎక్కడ వస్తుందంటే, వాళ్ళ accountability ని, నీ మీద ఒక Debt (అప్పు) గా convert చేస్తున్నారు. అప్పుడే నువ్వు వాళ్ళ గుప్పిట్లో ఉంటావు.

"నేను నీ కోసం కష్టపడ్డాను"... ఈ మాట అక్కడితో ఆగదు. దాని వెనుక ఒక silent condition ఉంది.

"నేను నీ కోసం కష్టపడ్డాను... కాబట్టి, నేను గీసిన గీత నువ్వు దాటకూడదు. నేను అడిగింది నువ్వు తిరిగి ఇచ్చేయాలి."

దీన్ని వ్యాపారం అంటారు, Love అనరు!

ఒక businessman investment పెడతాడు. Returns ఆశిస్తాడు. రాకపోతే గల్లా పట్టుకుని అడుగుతాడు. మీ ఇంట్లో జరుగుతున్నది కూడా అదే! వాళ్ళు పెట్టిన investment కి నువ్వు return ఇవ్వాలి. ఆ return రూపం ఏంటి?

నీ Obedience (బానిసత్వం). దాన్నే ఈ సమాజం చాలా ముద్దుగా "Respect" అని పిలుస్తుంది.

నీకు music ఇష్టం, లేదా ఇంకేదో ఇష్టం. కానీ వాళ్ళు engineering చేయమంటారు. నువ్వు లాజికల్ గా అడిగితే... వాళ్ళు లాజిక్ తో సమాధానం చెప్పరు. వెంటనే వాళ్ళు వాడే weapon ఏంటి?

"నీ కోసం నేను రక్తం చిందించాను. ఈ కాలేజ్ ఫీజు కట్టడానికి నా వేళ్లు అరిగేలా పని చేశాను, నా కోరికలు చంపుకున్నాను, ఇప్పుడు నువ్వు అదేదో చేస్తానంటావా?"

అక్కడ topic నీ future గురించి. కానీ సెకన్ల వ్యవధిలో అది వాళ్ళ past లోకి వెళ్ళిపోయింది చూశావా? నువ్వు నీ passion ని defend చేసుకోవాల్సిన చోట, వాళ్ళ ముందు నిలబడి నీ existence కోసం, వాళ్ళ దయ కోసం అడుక్కుంటున్నావు. ఇదొక పక్కా psychological architecture. మీరు ప్రశ్నించకుండా మిమ్మల్ని అణగదొక్కే ఒక అద్భుతమైన పద్మవ్యూహం.

  • నువ్వొక valid question అడిగావా?
    "ఐతే నీకు పెద్దవాళ్ల మీద respect లేదు."
  • నువ్వు logics తో వాళ్ళ మూర్ఖపు చాదస్తాలని disagree చేస్తున్నావా ?
    "మేము పెంచిన తీరు చూడు, ఎలా ఎదురు మాట్లాడుతున్నాడో, వీడికి సంస్కారం లేదు."

Respect అంటే అర్థం ఏంటి వాళ్ళ దృష్టిలో? నీ మెదడుని తీసి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి, వాళ్ళు చెప్పిన ప్రతి చెత్త నిర్ణయానికీ గంగిరెద్దులాగ తలాడించడం. అది respect కాదు, దాన్ని Slavery అంటారు.

3. THE SOURCE CODE: భీష్ముడి అబద్ధం - బానిసత్వానికి గ్లోరిఫికేషన్

అసలు ఈ "త్యాగం", "పితృ భక్తి" అనే మత్తుమందుని ఈ సొసైటీకి అలవాటు చేసింది ఎక్కడో తెలుసా? మన పురాణాల్లో. అక్కడి నుంచే ఈ conditioning మన DNA లోకి ఎక్కింది. ఆ కథలని మనం గుడ్డిగా పూజిస్తున్నాం కాబట్టే, ఈరోజు ప్రతి తండ్రీ తన కొడుకుని ఒక బకరా గా వాడుకుంటున్నాడు.

లాజిక్ అనే కత్తితో కోసి చూపిస్తాను విను.

శంతనుడు. హస్తినాపురానికి మహారాజు. అతనికి అప్పటికే దేవవ్రతుడు అనే ఒక అద్భుతమైన కొడుకు ఉన్నాడు. వాడే కాబోయే రాజు. అంతా బాగానే ఉంది. కానీ ఆ వయసులో, ఆ ముసలితనంలో... శంతనుడికి సత్యవతి అనే ఒక పల్లెటూరి అమ్మాయి మీద మోహం పుట్టింది. Lust.

వెళ్లి ఆమె తండ్రిని అడిగితే, ఆ తండ్రి ఒక condition పెట్టాడు: "నా కూతురికి పుట్టే కొడుకే రేపు రాజు అవ్వాలి. నీ పెద్ద కొడుకు కాదు."

ఒక బాధ్యత గల తండ్రి, తన కొడుకుని నిజంగా ప్రేమించే తండ్రి ఏం చేయాలి?

"నా కొడుకు భవిష్యత్తుని నాశనం చేసి, వాడు కూర్చోవాల్సిన సింహాసనాన్ని లాక్కుని, నా కామం కోసం నేను ఈ పెళ్లి చేసుకోను" అని చెప్పి వెనక్కి రావాలి గా?

కానీ శంతనుడు ఏం చేశాడు? తిరిగి కోటకొచ్చి, అన్నం మానేసి, మూలన కూర్చుని పసి పిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు! ఒక సైలెంట్ డ్రామా. ఒక Emotional Blackmail. "నేను నా కొడుకుని అడగను, కానీ నా ఏడుపు చూసి వాడే నా కోరిక తీర్చాలి" అనే ఒక భయంకరమైన సైకలాజికల్ ట్రాప్.

అది చూసి కొడుకు కరిగిపోయాడు. తండ్రి గుడ్డి కామం కోసం, తన జీవితాన్ని మొత్తం తగలబెట్టేసుకున్నాడు. "నేను ఎప్పటికీ రాజుని కాను, జీవితాంతం పెళ్ళే చేసుకోను" అని ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు.

ఇప్పుడు ట్విస్ట్ విను.

ఒక తండ్రి తన lust కోసం కొడుకు జీవితాన్ని బలి తీసుకుంటే, సమాజం ఆ తండ్రిని ఛీ కొట్టాలి! అసహ్యించుకోవాలి!

కానీ ఈ సొసైటీ ఏం చేసింది? దేవవ్రతుడికి "భీష్ముడు" అని ఒక గొప్ప పేరు పెట్టి, ఆకాశం నుంచి పూల వాన కురిపించింది! "ఆహా! తండ్రి కోసం ఎంతటి త్యాగం చేశాడు! ఇతను దేవుడు!" అని కీర్తించింది.

ఎందుకు? ఆకాశం నుంచి పూలు ఎందుకు కురిశాయో తెలుసా?

ఎందుకంటే ఈ సిస్టం కి ఒక పిల్లాడి జీవితం నాశనమైనా సరే, తండ్రి మాటకు ఎదురు చెప్పని ఒక "బానిస" కావాలి. పెద్దవాళ్ళ తప్పులని, స్వార్థాన్ని కప్పిపుచ్చుకోవడానికి, పిల్లల బుర్రల్లోకి ఎక్కించిన అద్భుతమైన స్లో పాయిజన్ ఈ కథలు. వాడి జీవితం నాశనం అయిపోవడాన్ని "గొప్పతనం" (Glorification) కింద మార్చేశారు. ఎప్పుడైతే ఒక బానిసత్వాన్ని glorify చేస్తారో, అప్పుడు మిగతా వాళ్ళందరూ ఆ బానిసత్వంలోకి గుడ్డిగా వెళ్ళిపోతారు.

ఆ భీష్ముడిని దేవుడిలా మార్చారు కాబట్టే... ఈరోజు ప్రతి తండ్రీ తన ఇంట్లో ఒక శంతనుడిలా ఫీల్ అవుతున్నాడు! వాళ్ళ పరువు కోసం, వాళ్ళ స్వార్థం కోసం, నువ్వు భీష్ముడిలా బలి అయిపోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ కథల వెనుక ఉన్నది "ధర్మం" కాదు రా... ఆ కథల వెనుక ఉన్నది పక్కా పాలిటిక్స్. Control Politics.

4. THE BRUTAL REALITY CHECK: నా మాటల్లో లాజిక్ లేదా?

నా మాటలు కేవలం గాలిలో ఫిలాసఫీ అనిపిస్తున్నాయా? ప్రాక్టికల్ గా లేవు అని నీ మెదడు నిన్ను డిఫెండ్ చేస్తుందా? అయితే ఇప్పుడు నేను నీకు రెండు పచ్చి నిజాలు చెప్తాను.

Example 1: The Corporate College Slaughterhouse (చదువు అనే వ్యాపారం)

మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏడాదీ ఎంతో మంది స్టూడెంట్స్ కార్పొరేట్ కాలేజీల హాస్టల్ గదుల్లో ఉరివేసుకుని చనిపోಿದರು. అలా ఒక స్టూడెంట్ చనిపోయినప్పుడు, ఆ తల్లిదండ్రులు టీవీ కెమెరాల ముందుకొచ్చి ఏమని ఏడుస్తారో ఎప్పుడైనా గమనించావా?

"అయ్యో, నా బిడ్డకి చదువు కంటే బతకడం ఇంపార్టెంట్ అని నేను చెప్పలేకపోయానే" అని ఏడుస్తారా? లేదు!

వాళ్ళు ఏడ్చే డైలాగ్ ఒక్కటే: "వాడి కోసం మాకున్న రెండెకరాల పొలం అమ్మేశాం. ఊర్లో పది లక్షలు అప్పు చేసి తీసుకొచ్చి ఈ కాలేజీలో కట్టాం. మమ్మల్ని అప్పులపాలు చేసి వెళ్లిపోయాడే!"

అక్కడ వాళ్ళు ఏడుస్తున్నది వాళ్ళ కొడుకు చచ్చిపోయినందుకు కాదు... వాళ్ళు పెట్టిన Investment, వాళ్ళు ఆశించిన Returns రెండు మట్టిలో కలిసిపోయినందుకు. వాళ్ళ ego మీద ఉన్న ప్రేమ, పరువు మీద ఉన్న ఆశ... ఆ పిల్లాడి ప్రాణం కంటే పెద్దది అయిపోయింది. "మేము నీ కోసం పొలం అమ్మాము" అనే ఆ ఒక్క డైలాగ్ తో, ఆ పిల్లాడి మెదడులో ఎంత పెద్ద guilt ని నింపారో చూశావా? ఆ guilt తట్టుకోలేకే కదా వాడు చచ్చిపోయింది? దీన్నే నేను weaponized sacrifice అంటున్నాను.

Example 2: The "NRI/Software" Auction (పెళ్లి అనే మార్కెట్)

కూతురుకి పెళ్ళి వయసు వస్తుంది. ఇంట్లో చాలా డెమోక్రటిక్ గా అంటారు: "అమ్మా, నీకు ఎలాంటి వాడు కావాలి? నీ ఇష్టమే మా ఇష్టం." కానీ... ఆ అమ్మాయి తనకు నచ్చిన ఒక అబ్బాయిని, వాళ్ళ కులం కాని వాడినో, లేక నెలకు ముప్పై వేలు సంపాదించే ఒక సామాన్యుడినో చూపిస్తే... అప్పుడు ఏమవుతుంది?

వెంటనే అసలు రంగు బయటపడుతుంది: "నీ కోసం మేము రక్తం చిందించాం. నీకు లక్షలు పోసి ఇంజనీరింగ్ చదివించాం. అమెరికా సంబంధం అనుకుంటే నువ్వు వెళ్లి ఆ బిచ్చగాడిని పెళ్లి చేసుకుంటావా? సమాజంలో మా పరువు ఏం కావాలి?"

ఇక్కడ sacrifice అనే కార్డు ఎందుకు బయటకొచ్చింది? ఎందుకంటే, వాళ్ళు పెంచిన కూతురు వాళ్ళ దృష్టిలో ఒక మనిషి కాదు. ఒక Trophy. వాళ్ళ ego ని satisfy చేయడానికి నువ్వు ఒప్పుకోకపోతే... నీకు వాళ్ళు పెట్టిన అన్నం, కట్టిన ఫీజులు అన్నీ అప్పుల కింద లెక్కకట్టి, ఆ రశీదు నీ మొహాన కొడతారు.

5. THE SURGERY OF MODERN LOGIC:

"మేము నీ కోసం త్యాగం చేశాం, ప్రేమతో పెంచాం" అని నీ ఇంట్లో పేరెంట్స్ నీకు రోజూ కొట్టే డైలాగ్ వినగానే నీకు వెంటనే guilt స్టార్ట్ అయిపోతుంది కదా?

Logic 1:

వాళ్ళు నీ మీద ప్రేమతో చేశారని చెప్తున్నారు. పోనీ, అది సరే అనుకుందాం!

నిజమైన ప్రేమకు conditions ఉండవు కదా? "నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు బతుకు. తప్పులు చెయ్, కానీ నువ్వు ఒక మనిషిగా వికసించు" అని నీకు నచ్చిన దారిలో నిన్ను వదిలేయాలి గా? నీకు స్వేచ్ఛ (Freedom) ఇవ్వాలి గా?

ఇస్తున్నారా? లేదు. స్వేచ్ఛ ఇవ్వనప్పుడు అది ప్రేమ కాదు.

Logic 2:

"మేము కష్టపడి పెంచాం కాబట్టి, మాకు కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి, మా మాట వినాలి" అంటారు. అంటే దాన్నొక బాధ్యత లాగ, డ్యూటీ లాగ పెంచారన్నమాట. పోనీ, అది సరే అనుకుందాం!

మరి ఆ లాజిక్ ప్రకారం చూస్తే... పిల్లల్ని పెంచడం ఒక బాధ్యతగా నిర్వర్తించినపుడు, మరి దాన్నొక అప్పు లాగా మార్చకూడదు కదా? "నీకు నేను ఫీజు కట్టాను కాబట్టి, నాకు నచ్చిన కోర్సే నువ్వు చదవాలి" అని నీ గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ పరువు కోసం నిన్ను blackmail చేయకుండా ఉండాలి గా? నీ వ్యక్తిత్వాన్ని గౌరవించాలి గా?

గౌరవిస్తున్నారా? లేదు.

Logic 3:

"ఇదంతా దేనికిరా... నీ సంతోషం కోసమే కదా!" అంటారు. పోనీ... అది కూడా సరే అనుకుందాం!

మరి ఆ లాజిక్ ప్రకారమైనా... "నాకు మీరు తెచ్చిన ఆ కోటీశ్వరుడి సంబంధం వద్దు, నేను ప్రేమించిన ఈ సామాన్యుడితోనే సంతోషంగా ఉంటాను" అని నువ్వు ఏడుస్తూ చెప్తే... నీ సంతోషమే వాళ్ళ లక్ష్యం అయినప్పుడు, పరుగు పరుగున వచ్చి... "సమాజం ఏమైపోయినా పర్లేదు నాన్నా, నీ సంతోషమే మాకు ముఖ్యం" అని చెప్పి నిన్ను ఆశీర్వదించాలి గా?

జరుగుతుందా? అక్కున చేర్చుకుంటున్నారా? లేదు.

  • ప్రేమ ప్రకారం చూస్తే... స్వేచ్ఛ లేదు.
  • బాధ్యత ప్రకారం చూస్తే... గౌరవం లేదు.
  • నీ సంతోషం ప్రకారం చూస్తే... అక్కడ అసలు Acceptance లేదు.

మరి ఏంటిదంతా? బకరా... నువ్వు ఒక బకరావి! You are a Bakara!

6. THE ROOT CAUSE: THE EGO PROJECT

ఇప్పుడు నేను చెప్పేది వింటే నీకు మండోచ్చు. కానీ ఇది నిజం.

నీ parents కి, నీ మీదున్న ప్రేమ కంటే, వాళ్ళ EGO మీదున్న ప్రేమే ఎక్కువ.

వాళ్ళ జీవితాల్లో వాళ్ళకంటూ ఒక purpose లేదు. వాళ్ళు individual గా సాధించింది ఏమీ లేదు. సొంతంగా ఆనందంగా ఎలా బతకాలో వాళ్ళకి తెలియదు. అందుకే నువ్వు వాళ్ళ పాలిట ఒక 'Project' వి. వాళ్ళ ఫెయిల్ అయిన జీవితాలకు నీ సక్సెస్ ని plaster లాగా వేసుకుని, "మా అబ్బాయిని చూశారా, మా అమ్మాయిని చూశారా" అని పక్కింటి వాళ్ళ ముందు కాలర్ ఎగరేయాలి.

నీ సంతోషం, నీ ఏడుపు వాళ్ళకి అనవసరం. వాళ్ళ అహంకారం బతకాలి. వాళ్ళ ఈగో కి ఆకలి వేసిన ప్రతిసారీ, "త్యాగం" అనే కత్తితో పొడిచి నిన్ను బలి ఇస్తున్నారు. నువ్వు డాక్టర్ అవ్వకపోతే వాళ్ళ పరువు పోద్ది. నువ్వు వాళ్ళు చెప్పిన అమ్మాయిని చేసుకోకపోతే వాళ్ళ ప్రతిష్ట మంటగలిసిపోద్ది. అసలు వాళ్ళ పరువుకి, వాళ్ళ అహంకారానికి, నీ జీవితం ఎందుకొక ముడిసరుకు (raw material) లాగా మారిపోయింది?

నువ్వు ఒక కొడుకువి కాదు, ఒక కూతురివి కాదు... వాళ్ళ పరువుని మోసే ఒక పల్లకివి. ఒక instrument వి. ఎప్పుడైతే వాళ్ళ మాట వినవో, ఆ పల్లకి మోయడం ఆపేస్తావో... అప్పుడే అసలు రూపం బయటపడుతుంది. అప్పుడే "నీ కోసం రక్తం చిందించాం" అనే బ్లాక్ మెయిల్ మొదలవుతుంది. తరతరాలుగా వస్తున్న ఒక generational disease ఇది. మీ నాన్న వాళ్ళ నాన్నకు బానిస. ఇప్పుడు నువ్వు మీ నాన్నకు బానిస. ఎందుకంటే సిస్టం కి ఆలోచించే మనుషులు వద్దు. భయపడే వాళ్ళు కావాలి. గుడ్డిగా ఫాలో అయ్యే గొర్రెలు కావాలి.

7. THE DISTINCTION: TRUE LOVE VS. ATTACHMENT

నేను నీ parents ని అసహ్యించుకోమని చెప్పట్లేదు. వాళ్ళని వదిలేసి రోడ్డు మీద పడమని చెప్పట్లేదు. నేను నీకు ఒక పదునైన lens ఇస్తున్నాను. మీ కళ్ళకి పట్టిన మసకను తుడుస్తున్నాను.

Love కి, Attachment కి మధ్య ఉన్న ఆ సన్నటి గీతను గుర్తించు.

నీకు జ్వరం వస్తే రాత్రంతా నీ పక్కన కూర్చున్నారు చూశావా? ఏ return ఆశించకుండా, ఏ debt గురించి mention చేయకుండా చేసిన ఆ పనులలో... అక్కడ love ఉంది. Pure action.

కానీ, "నీకు జ్వరం వచ్చినప్పుడు నేను నిద్రపోలేదు, కాబట్టి ఈరోజు నేను చెప్పిన వాడినే నువ్వు పెళ్లి చేసుకోవాలి" అని ఎప్పుడైతే అంటారో... అక్కడ love చచ్చిపోయింది. అది Attachment. అది Insecurity. అది Blackmail.

"Love that keeps a receipt.. is not love. It is a loan." (రశీదు రాసి పెట్టుకునేది ప్రేమ కాదు, అది ఒక అప్పు.)

నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి నీకు ఎప్పుడూ స్వేచ్ఛను ఇస్తాడు. Freedom ఇస్తాడు. నువ్వు ఎదగాలి అనుకుంటాడు. నువ్వు కింద పడినా సరే, నీ తప్పుల నుండి నువ్వు నేర్చుకుని ఒక independent, conscious human being గా ఎదగాలి అనుకుంటాడు. నీ obedience, నీ బానిసత్వం వాళ్ళకి వద్దు. ఎప్పుడైతే నీ చేతులు కట్టేసి, నీ ఆలోచనలని తొక్కేసి, "నేను త్యాగం చేశాను, కాబట్టి నువ్వు ఇక్కడే పడి ఉండు" అంటున్నారో... దానికి వాళ్ళు ఏ పేరైనా పెట్టుకోనీ, నువ్వు మాత్రం దాన్ని గుడ్డిగా love అని నమ్మకు.

8. THE AWAKENING: దేవుళ్ళు కారు, బాధితులే!

ఒక్కసారి కళ్ళు మూసుకుని నిజాయితీగా ఆలోచించు.

నీ జీవితంలో ఎన్ని decisions నువ్వు నీ సొంత బుర్రతో తీసుకున్నావు? ఎన్ని decisions కేవలం ఈ 'sacrifice' అనే దెయ్యానికి భయపడి, ఆ guilt తో భరిస్తూ తీసుకున్నావు? నువ్వు చదువుతున్న కోర్సు నీదా? నువ్వు చేస్తున్న జాబ్ నీదా? ఒక మనిషి తనని తాను చంపుకుని, తన బతుకుని పక్కనోడికి తాకట్టు పెట్టి బతకడాన్ని 'సంస్కారం' అనరు, దాన్ని 'ఆత్మహత్య' అంటారు.

నీ parents ఎవరూ విలన్స్ కాదు. వాళ్ళు దెయ్యాలు కాదు. వాళ్లు కూడా Victims ఏ. వాళ్లకి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన అబద్ధాన్నే వాళ్ళు బతుకుతున్నారు. మీరిద్దరూ ఒక కంపు కొడుతున్న, broken సామాజిక సిస్టంలో ఇరుక్కుపోయిన బానిసలు.

ఇప్పుడు నీకు రెండు దారులు ఉన్నాయి.

  • Option 1: ఈ వీడియో చూశాక నీ ego హర్ట్ అవ్వొచ్చు. "వీడెవడో వచ్చి మా అమ్మానాన్నలని ఏదేదో అంటున్నాడు, మన culture ని నాశనం చేస్తున్నాడు" అని కోపం రావచ్చు. కింద కామెంట్స్ లో నీకు నచ్చిన బూతులు తిట్టుకో. "మా అమ్మానాన్న అలా కాదు, మాది గొప్ప family" అని నీకు నువ్వు అబద్ధం చెప్పుకుని ఆ గుడ్డి నిద్రలోనే బతుకు. అది చాలా easy.
  • Option 2: గంతలు విప్పు, కళ్ళు తెరువు. ఆ లాజిక్ ని ప్రశ్నించు. భయం వదిలెయ్. నేను చెప్పిన దాంట్లో ఒక్క లాజిక్ అయినా తప్పు ఉందేమో చూడు. ఒకసారి వాళ్ళ కళ్ళలోకి చూసి లాజికల్ గా అడుగు: "ఇది నా జీవితమా, లేక మీ కలలు తీర్చుకునే ఒక instrument నా నేను?" అని.

భూకంపం వస్తుంది. రానివ్వు. పగిలిపోయే బంధాలు పగిలిపోనివ్వు. కానీ బతికినన్ని రోజులు ఒక మనిషి లాగా బతుకు, అప్పు తీర్చే యంత్రం లాగా కాదు. నీ తండ్రి శంతనుడు కాదు, నువ్వు భీష్ముడివి అంతకంటే కాదు. ఇది మహాభారతం కాదు, ఇది నీ జీవితం. ఒకవేళ నువ్వు భీష్ముడివి అయితే... అంపశయ్య (bed of arrows) మీద పడి, సొసైటీ గుచ్చుతున్న సూటిపోటి మాటల మధ్య, జీవితం మొత్తం గుడ్డిగా ఏడుస్తూ బతుకుతావు.

నీకు నిజం తెలుసుకోవాలనే ధైర్యం ఉంటే, నీ బుర్రలో ఉన్న ఆ చెత్తను క్లీన్ చేసుకోవాలి అనిపిస్తే... అప్పుడు మాత్రమే ఈ నిజాలని జీర్ణించుకో. ఇక్కడ నేను నీకు నచ్చే అబద్ధాలు చెప్పను. నీకు మండే నిజాలు మాత్రమే చెప్తాను.

సిస్టం మారదు. సమాజం మారదు. వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు.

మరి మారాల్సిందెవరు? నువ్వు.

Comments

Popular posts from this blog

మీరు బతుకుతున్నారా, లేక Normal అనే నాటకంలో గొర్రెలా నటిస్తున్నారా? పిచ్చివాళ్ల సమాజంలో Normal గా బతకడమే అతిపెద్ద పిచ్చి!

నీ జీవితంలో ఉన్నవి Problems కావు, నీ చిల్లర కోరికలు.

బానిసత్వానికి నువ్వు పెట్టుకున్న ముద్దుపేరు "బాధ్యత".