Overthinking: ఒక మానసిక వ్యాధి కాదు, మీ అస్తిత్వపు శూన్యానికి నిదర్శనం (The Naked Truth Nobody Tells You)

క్లేమేషన్ శైలిలో అతిగా ఆలోచించడం (Overthinking) వల్ల కలిగే మానసిక ఒత్తిడిని సూచించే చిత్రం. మెదడులో ఆలోచనల రద్దీ మరియు 'No Vacancy' బోర్డుతో ఉన్న ఒక వ్యక్తి ముఖం.

Overthinking అనే భ్రమ: దీని వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి?

తెలుగు YouTube channels లో, Podcast లలో "How to stop Overthinking" అని వెతికితే మీకు దొరికే చెత్త అంతా ఒకేలా ఉంటుంది. "శ్వాస మీద ధ్యాస పెట్టండి", "పాజిటివ్ గా ఆలోచించండి", "To-do list రాసుకోండి" అని సలహాలు ఇస్తుంటారు. Let’s be brutally honest. ఇదంతా పైపైన పూసే మందు మాత్రమే. అసలు రోగాన్ని ఎవరూ address చేయరు. ఎందుకంటే అసలు నిజం చాలా చేదుగా ఉంటుంది. దాన్ని జీర్ణించుకునే దమ్ము చాలా మందికి లేదు.

You don't have an Overthinking problem, You have an "Under-living" problem

ఈ రోజు ఒక కొత్త కోణం లోంచి, అత్యంత కఠినమైన లాజిక్ తో ఈ Overthinking అనే భ్రమను బద్దలు కొడదాం. మీ మెదడు ఎక్కువగా ఆలోచిస్తోంది అని మీరు భయపడుతున్నారు. కానీ అసలు నిజం ఏమిటంటే, మీ జీవితంలో ఆలోచించడానికి "విలువైనది" (Worthy) ఏదీ లేదు కాబట్టే, మీ మెదడు చెత్తను తింటోంది.

మానవ మెదడు ఒక శూన్యాన్ని (Vacuum) భరించలేదు. దానికి ఎప్పుడూ ఏదో ఒక ఆహారం కావాలి. మీరు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మీ బుర్రలో నడిచే ఆలోచనలను ఒకసారి లాజికల్ గా విశ్లేషించండి:

  • "బస్సు టైంకి రాలేదు, నా లైఫ్ ఏమైపోతుందో?"
  • "వాడు నా మెసేజ్ కి రిప్లై ఎందుకు ఇవ్వలేదు?"
  • "అసలు నా లైఫ్ ఎందుకింత బోర్ గా ఉంది?"

ఇలాంటి పనికిమాలిన విషయాల గురించి మీరు గంటలు గంటలు ఎందుకు ఆలోచిస్తున్నారు? సమాధానం చాలా సింపుల్: You have a huge inner vacancy.

పెద్ద లక్ష్యం ఉన్నవాడికి చిన్న ఆలోచనలు రావు

ఒక వ్యాపారవేత్త, ఒక SCIENTIST, లేదా ప్రాణం పణంగా పెట్టి పోరాడే ఒక సైనికుడు "నాకు బస్సు లేట్ అయ్యింది, నా భవిష్యత్తు ఏంటి?" అని ఏడుస్తూ కూర్చోడు. ఎందుకు? వాళ్ళకు Overthinking అనే జబ్బు లేదా? కాదు. వాళ్ళ జీవితంలో ఈ చిన్న చిన్న విషయాలకంటే వేల రెట్లు ముఖ్యమైన ఒక పెద్ద లక్ష్యం ఉంది. ఎప్పుడైతే మీ జీవితంలో ఒక బలమైన, స్పష్టమైన ప్రాముఖ్యత (Importance) ఉండదో, అప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు germs లాగా మీ మెదడును అటాక్ చేస్తాయి.

గాలిలో BACTERIA, VIRUS లు ఎప్పుడూ ఉంటాయి. వాటన్నింటినీ మీరు ఆపలేరు. మీరు చేయగలిగిందల్లా మీ లోపల "Immunity" ని పెంచుకోవడం మాత్రమే. అలాగే, బయట ప్రపంచంలో జరిగే చెత్త సంఘటనలను మీరు ఆపలేరు. కానీ మీ లోపల ఒక మహత్తరమైన లక్ష్యం ఉంటే, ఈ చెత్త ఆలోచనలకు మీ బుర్రలో "No Vacancy" అనే బోర్డు కనిపిస్తుంది.

Anxiety: ఈ జనరేషన్ ఫీల్ అవుతున్న ఒక విలాసం (Luxury)

వినడానికి కఠినంగా ఉన్నా ఇదే నిజం. ఒక అడవిలో మీ వెనుక ఒక పులి వెంటబడ్తూ ఉంటే, దాన్నుండి ఎలా ఐనా తప్పించుకోవాలనే తపన మీలో ఉన్నప్పుడు, ఆ తపనతో మీరు పరిగెడ్తున్నపుడు, "నా Hair style ఎలా ఉంది?", "నా Crush నన్ను ఎందుకు ignore చేసింది?" అని ఆలోచిస్తారా? ఆలోచించరు. First of all, ఆ క్షణంలో అసలలాంటి ఆలోచనలు మీ బుర్రలోకసలొస్తాయా? రావు. మీ focus మొత్తం ప్రాణాలు దక్కించుకోవడం పైనే ఉంటుంది. అంటే, మీ ముందు ఒక అతిపెద్ద సమస్య లేదా లక్ష్యం ఉన్నప్పుడు, ఈ చెత్త ఆలోచనలు దానంతట అవే మాయం అవుతాయి.

మీరు ప్రతి చిన్న విషయానికి Overthink చేస్తున్నారు అంటే దాని అర్థం, మీ జీవితంలో మీరు face చేస్తున్న నిజమైన సవాళ్లు ఏమీ లేవు. మీరు చాలా comfort zone లో ఉన్నారు. అందుకే మీ Ego తనకు తానే ఒక fake dramaను create చేసుకుంటోంది.

గత పది రోజుల్లో మీరు ఏం సాధించారు? ఎవరైనా అడిగితే మీరు నిజాయితీగా చెప్పాల్సిన సమాధానం: "Nothing in particular" (ప్రత్యేకంగా ఏమీ లేదు). మీరు ఎప్పుడూ బిజీ గానే ఉంటారు. Social Media Scroll చేస్తారు, కిటికీ లోంచి బైటకి చూస్తారు, ఎవరో తెలియని వ్యక్తుల ముఖాలు చూసి వాళ్ళ గురించి పది నిమిషాలు ఆలోచిస్తారు. రోజంతా busy, కానీ result సున్నా.

దీనికి ఏకైక విరుగుడు: Immersion (పూర్తిగా లీనమైపోవడం)

దీనికి విరుగుడు ధ్యానం కాదు, motivational videos కాదు. దీనికి ఒకే ఒక్క విరుగుడు: Immersion.

"భగత్ సింగ్ గురించి ఆలోచించండి. అతను చనిపోయే ముందు రోజు రాత్రి కూడా జైల్లో కూర్చుని ఒక పుస్తకం చదువుతున్నాడు. రేపు ఉదయం ఉరి తీస్తారు అనగా, జైలర్ వచ్చి సమయం అయింది అన్నప్పుడు, 'ఆగు, ఒక విప్లవకారుడు ఇంకో విప్లవకారుడితో మాట్లాడుతున్నాడు' అని ఆ పేజీని మడిచి వెళ్ళాడు."

అతనికి రేపు చనిపోతాను అనే Overthinking లేదా? Anxiety లేదా? ఎందుకు లేదు? ఎందుకంటే అతని జీవితంలో ఏ శూన్యమూ లేదు. అతని తల్లి పెళ్లి చేసుకోమన్నప్పుడు "నేను అప్పటికే పెళ్లి చేసుకున్నాను, నా పెళ్ళాం పేరు 'ఆజాదీ' (స్వాతంత్య్రం)" అని చెప్పాడు.

మీరు ఒక అద్భుతమైన లక్ష్యంతో ప్రేమలో పడినప్పుడు, మీకు ఆకలి వేసినా, చలి వేసినా, జేబులో డబ్బులు లేకపోయినా... మీ బుర్ర వాటి గురించి ఆలోచించదు. "I am occupied. Sorry, no vacancy" అని ఆ ఆలోచనలను తరిమేస్తుంది.

మీ అస్తిత్వాన్ని ప్రశ్నించే కఠినమైన ప్రశ్నలు

ఇప్పుడు మీలో మీరు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. ఎవరికోసమో కాదు, ఏ సొసైటీ కోసమో కాదు. కేవలం మీ బతుకు మీద మీకు ఒక క్లారిటీ రావడం కోసం.

  1. What is your "ఆజాదీ"? మీ జీవితంలో మీరు ప్రాణమైన పెట్టేయగలిగేటంత "ముఖ్యమైన" విషయం ఏముంది? లేకపోతే, వెంటనే దాన్ని వెతకడం మొదలుపెట్టండి.

  1. Stop the Fake Busyness: మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ చేతులు ఆటోమాటిక్ గా ఫోన్ వైపు వెళ్తున్నాయి అంటే, మీరు మీ ఆలోచనలతో మీరు ఒంటరిగా ఉండటానికి భయపడుతున్న ఒక పిరికివారు (Coward) అని అర్థం.
  2. Declare "No Vacancy": రేపటి నుండి ఒక పనికిమాలిన ఆలోచన మీ బుర్రలోకి రాగానే, "నాకు దీని గురించి ఆలోచించేంత టైం లేదు, నా ముందు ఒక పెద్ద లక్ష్యం ఉంది" అని దాన్ని నిర్దాక్షిణ్యంగా కట్ చేయండి.

The Choice is Yours

Overthinking అనేది ఒక మానసిక వ్యాధి కాదు. అది మీ జీవితం ఎటు వెళ్తుందో తెలియని ఒక దిక్కుతోచని స్థితికి ఒక సింప్టమ్ (Symptom). సమాజం మీకు నేర్పిన మాయలో పడి ఈ వ్యాధికి మందు వెతక్కండి. ఆ వ్యాధిని పుట్టిస్తున్న మీ ఖాళీ బుర్రకు, ఒక మహత్తరమైన లక్ష్యాన్ని ఆహారంగా వేయండి.

ఆ లక్ష్యం కోసం బ్రతుతున్నంత కాలం, మీకు మానసిక సమస్యలు వచ్చే అవకాశం, సమయం, ఓపిక, తీరిక ఉద్దేశం ఏవీ ఉండవు. If you are not immersed, you are scattered. ఎంపిక మీదే.

ఒక purpose తో లీనమైపోయి జీవిస్తారా? లేక జీవితాంతం బస్సు సీటులో కూర్చుని కిటికీ బైటకి చూస్తూ, "Nothing in particular" అని మీ కథను ముగిస్తారా?

Comments

  1. Thank you bro. Iam. Regular reader

    ReplyDelete
  2. ఈ ప్రతికూల వేదాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మీరు బతుకుతున్నారా, లేక Normal అనే నాటకంలో గొర్రెలా నటిస్తున్నారా? పిచ్చివాళ్ల సమాజంలో Normal గా బతకడమే అతిపెద్ద పిచ్చి!

నీ జీవితంలో ఉన్నవి Problems కావు, నీ చిల్లర కోరికలు.

బానిసత్వానికి నువ్వు పెట్టుకున్న ముద్దుపేరు "బాధ్యత".