నీ భక్తి వెనుక దాగున్న అసలైన భయం. సనాతన ధర్మానికి అసలైన శత్రువు ఎవడు?
11,000 లీటర్ల పాలు, చచ్చిపోతున్న నది... మన 'భక్తి' వెనుక దాగున్న అసలైన సైకాలజీ ఏంటి?
మనం ఒక అద్భుతమైన illusion లో బ్రతుకుతున్నాం. నిజంగా, అప్పుడప్పుడూ మన సొసైటీని చూస్తుంటే, ఒక పెద్ద Mental Hospital లో ఉన్నామా అనిపిస్తుంది.
ఒక పక్క చేతిలో AI ఉంది, Mars మీదకి మనుషుల్ని పంపాలని లెక్కలేస్తున్నాం, 5G internet తో ప్రపంచాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నాం. మనం చాలా డెవలప్ అయిపోయాం, 21st century లో ఉన్నాం అని ఒక ఫేక్ ఫీలింగ్. కానీ, బుర్ర లోపలికి వెళ్లి మన సైకాలజీని స్కాన్ చేసి చూస్తే... ఇంకా ఎక్కడో రాతి యుగంలో, నిప్పు ఎలా పుట్టించాలో తెలియని చీకటి గుహల్లోనే బ్రతుకుతున్నాం. మన technological progress కి, మన psychological maturity కి మధ్య ఉన్న ఈ gap చూస్తే జాలేయాలో, నవ్వాలో అర్థం కాదు.
దానికి బెస్ట్ ఎగ్జాంపుల్... రీసెంట్ గా నర్మదా నదిలో జరిగిన ఒక ఎపిక్ కామెడీ. ఆ నదిలో ఏకంగా 11,000 లీటర్ల పాలు కుమ్మరించారు కొందరు మహానుభావులు. ఎందుకు? అంటే... అది వాళ్ళ సాంప్రదాయమాట, నమ్మకమట, వాళ్ళ భక్తి అట!
ఇప్పుడు నువ్వు ఈ blog చదువుతున్నావు కదా... నీకు ఏమనిపిస్తుంది? "అవును కదా, మన సంప్రదాయాల్ని మనం కాపాడుకోవాలి, అందులో తప్పేముంది?" అని నీకు అనిపిస్తే, ఇక్కడే ఆపేసి వెళ్లిపో. ఎందుకంటే, ఇక్కడ్నుండి నేను మాట్లాడే మాటలు నీ ego ని, నీ ఫేక్ ఐడెంటిటీని నిర్దాక్షిణ్యంగా కోసి పక్కన పెడతాయ్. ఆ సర్జరీ తట్టుకునే దమ్ము నీకు లేదు. లేదు, నిజంగా 'సత్యం' ఏంటో చూడాలి, నా బుర్రకి పట్టిన తుప్పు వదిలించుకోవాలి అనుకుంటే మాత్రం... ముందుకెళ్లు.
Chapter 1: The Economics of 'Bhakti' (ఇది భక్తి కాదు, ఒక చీప్ బిజినెస్ డీల్!)
11,000 లీటర్ల పాలు ఒక నదిలో పోస్తే దేవుడు కరుణిస్తాడు అని ఎవడు చెప్పాడ్రా నీకు? దేవుడికి పాలు కావాలని ఆయన నీ కలలోకి వచ్చి అడిగాడా?
ఒక్కసారి లాజికల్ గా, ఒక సైంటిఫిక్ మైండ్ తో ఆలోచించు. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు నుంచి. ఆవుని, పాలని, నదిని, నిన్ను... అన్నిటినీ సృష్టించింది ఆ యూనివర్స్ (లేదా భగవంతుడు) కదా? అంటే, వాడు సృష్టించిన పాలని తీసుకెళ్లి, వాడు సృష్టించిన నదిలో పోసి, వాడికే గిఫ్ట్ ఇస్తున్నావా? ఇదేం లాజిక్ రా బాబు? మీ నాన్న జేబులోంచి వంద రూపాయలు కొట్టేసి, మళ్ళీ ఆ వంద రూపాయలతో మీ నాన్నకే బర్త్డే గిఫ్ట్ కొనిచ్చినట్టు లేదా ఇది? పరమాత్మ అంటే అంత ఎదవలాగా కనిపిస్తున్నాడా నీకు?
అసలు ఫాక్ట్ ఏంటో చెప్పనా? ఇది భక్తి కాదు. ఇది సాంప్రదాయం అంతకన్నా కాదు. ఇది ఒక pure business transaction.
మనం ఒక corrupt సొసైటీలో బ్రతుకుతున్నాం. మనకి ఒక పని కావాలంటే RTO ఆఫీసర్ కి లంచం ఇవ్వాలి, మున్సిపాలిటీ వాడికి లంచం ఇవ్వాలి. మన సైకాలజీ ఎలా తయారైపోయిందంటే, ఆఖరికి ఆ యూనివర్స్‌ని నడిపే దేవుడిని కూడా ఒక 'కరప్ట్ ఆఫీసర్' లాగే చూస్తున్నాం.
"దేవుడా, నా కొడుక్కి అమెరికాలో వీసా రావాలి. నా బిజినెస్ లో కోటి రూపాయల లాభం రావాలి... నువ్వు ఆ ఫైల్ మీద సంతకం పెట్టు, నేను నీకు 11,000 లీటర్ల పాలతో లంచం ఇస్తాను."
ఇదే కదా నీ అసలు ఉద్దేశ్యం? నీ స్వార్థం, నీ భయం, నీ అత్యాశ... వీటన్నిటికీ నువ్వు వేసుకున్న పవిత్రమైన ముసుగే ఈ 'సంప్రదాయం'. నీ భక్తి వెనుక ఉన్నది పరమాత్మ కాదు, నీ అహంకారం (Ego). నీ ఈగోకి దేవుడు ఒక బానిస అవ్వాలి. నువ్వు పాలు పోస్తే, ఆయన నీ పనులు చేసిపెట్టాలి. ఇది భక్తి ఎలా అవుతుంది భయ్యా? ఇది ఒక చీప్ బేరం!
Chapter 2: The Mother Context (తల్లి క్యాన్సర్ తో చస్తుంటే పాలు పోస్తావా?)
మనవాళ్ళు భలే డైలాగులు కొడతారు... "నది మాకు తల్లి లాంటిది" అని. ఓకే, ఒప్పుకుందాం.
నీ సొంత తల్లి ఐసీయూలో క్యాన్సర్ తో ప్రాణాలు వదులుతుంటే ఏం చేస్తావు? డాక్టర్ల కాళ్ళు పట్టుకుంటావు, ఆక్సిజన్ సిలిండర్ తెస్తావు. అంతే కానీ, ఆవిడ మీద తీసుకెళ్లి 11,000 లీటర్ల పాలు పోస్తావా? పోస్తే నిన్ను ఏమంటారు? సైకో అంటారు.
మరి ఈరోజు నర్మదా నది, గంగా నది పరిస్థితి ఏంటి? ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్స్ వల్ల, మనం పడేసే ప్లాస్టిక్ వల్ల నదులన్నీ డ్రైనేజీలుగా మారిపోయాయి. ఆ నీటిలో ఆక్సిజన్ లేక లోపల ఉన్న జీవరాశులు గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోతున్నాయి. ఒక రకంగా ఆ నదులు క్యాన్సర్ తో ఐసీయూలో ఉన్నాయి. ఇలాంటి టైం లో, ఆ చచ్చిపోతున్న నదికి ఆక్సిజన్ అందించడం, దాన్ని క్లీన్ చేయడం నీ బాధ్యత. అదే నీ ధర్మం.
కానీ నువ్వు ఏం చేస్తున్నావు? దానికి ఇంకో 11,000 లీటర్ల పాలు పోసి, Bio-chemical oxygen demand పెంచేసి, ఇంకా ఆక్సిజన్ లేకుండా చేసి దాన్ని గొంతు పిసికి చంపేస్తున్నావు. నీకు బ్రతుకును ఇచ్చే తల్లి లాంటి నదిని చంపేస్తూ... నువ్వు పుణ్యం మూటగట్టుకుంటున్నావా?
Chapter 3: The Ultimate Logic Test (మనం బకరా ఎలా అయ్యామంటే...)
సరే, నేను చెప్పిన వేదాంతం, సైన్స్ అన్నీ పక్కన పెట్టేద్దాం. మీ వాదననే కరెక్ట్ అనుకుందాం. దాన్ని ఒక లాజికల్ ఫిల్టర్ లో వేసి చూద్దాం. గుడ్డలూడదీసి నిజాన్ని మాట్లాడుకుందాం. దమ్ముంటే ఈ లాజిక్స్ కి ఆన్సర్ చెప్పు.
లాజిక్ 1: ఆధ్యాత్మిక మార్పు ఎక్కడ?
భగవంతుడికి పాలు పోయడమే అత్యున్నతమైన పూజ, దానివల్లే ఆత్మశాంతి వస్తుంది అనుకుందాం. మరి ఆ 11,000 లీటర్ల పాలు పోసిన వాళ్ళు బయటకి రాగానే బుద్ధుడిలాగా మారిపోయి ఉండాలి కదా. వాళ్ళ జీవితాల్లో ఇంకెప్పుడూ అవినీతి చేయకూడదు, కులం పేరుతో కొట్లాడుకోకూడదు. మరి అలా మారిపోయిన వాళ్ళు ఉన్నారా? లేదు. పాలు పోసి ఇంటికి రాగానే మళ్ళీ పక్కింటోడితో గొడవలు, ఆఫీసులో లంచాలు. క్యారెక్టర్ లో మార్పు లేనప్పుడు ఆ పాలు పోసి ఎవరిని ఉద్ధరించినట్టు?
లాజిక్ 2: కోరికలు తీర్చే దేవుడు
"మేమేం సన్యాసులం కాదు, కష్టాలు తీర్చమని అడుగుతున్నాం" అంటావా? దేవుడికి పాలు పోస్తే దేవుడు మన కోరికలు తీరుస్తాడు అనుకుంటే... ఈ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండాల్సింది కోట్లు గడించే అత్యంత ధనవంతులు! వాళ్ళు తలుచుకుంటే 11 లక్షల లీటర్ల పాలు రోజూ పోయగలరు. మరి వాళ్ళకి క్యాన్సర్లు రాకూడదు కదా? వాళ్ళకి ఏ టెన్షన్స్ ఉండకూడదు కదా? మీరు పోసే పది లీటర్లకే దేవుడు మీ కోరికలు తీరిస్తే, లక్షల లీటర్లు పోసే వాళ్ళని ఇంకెంత కరుణించాలి? మరి వాళ్ళు హాస్పిటల్స్ లో లక్షలు కట్టి ఏడట్లేదా?
లాజిక్ 3: అసలైన దైవత్వం ఎక్కడ ఉంది?
అదే నది పక్కన చలికి వణుకుతూ ఆకలితో ఏడుస్తున్న ఒక అనాధ పిల్లాడికి ఆ పాలు ఇస్తే దేవుడు సంతోషిస్తాడా? లేక మురుగు కాలువలాగా మారిపోయిన నదిలో ఆ పాలు పోసి వేస్ట్ చేస్తే దేవుడు సంతోషిస్తాడా? కనీసం ఆ మినిమమ్ మానవత్వం, కామన్ సెన్స్ ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారా?
ఆఖరికి కామన్ సెన్స్ కూడా ఫెయిల్. మరి ఇదంతా ఏంటి? ఇక్కడ బకరా అవుతున్నది నువ్వే! నీ భయాన్ని క్యాష్ చేసుకోవడానికి కొన్ని వందల ఏళ్లుగా నడుస్తున్న 'మతపరమైన వ్యాపారం' ఇది. దేవుడి పేరు చెప్పి నీ బుర్రని, నీ లాజిక్ ని తాకట్టు పెట్టేశారు. నిన్ను మానసికంగా ఒక బానిసని (slave) చేసేశారు.
Chapter 4: The Fake Dilemma (సాంప్రదాయం vs బాధ్యత అనే ఒక పనికిమాలిన ప్రశ్న)
ఇలాంటివి జరిగినప్పుడు, మన టీవీ ఛానెల్స్ లో కూర్చునే మేధావులు ఒక పెద్ద డిబేట్ పెడతారు: "ఒక పక్క పర్యావరణ బాధ్యత (Responsibility), ఇంకో పక్క మన సాంప్రదాయం (Faith). ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి?"
అసలు ఈ లాజిక్ ఎవడికైనా తడుతుందా? బ్యాలెన్స్ ఎప్పుడు చేస్తాం? రెండు వేర్వేరు వస్తువులు, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేస్తాం. అంటే నీ ఉద్దేశ్యంలో "దేవుడు" వేరు, "ప్రకృతి" వేరా?
నిజమైన సాంప్రదాయం ఉంటే, నీ బాధ్యత ఏంటో నీకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. సాంప్రదాయం, బాధ్యత రెండు వేరు కాదు, రెండు ఒకటే! దీన్నే వేదాంతం 'శ్రుతి-ధర్మం' అంటుంది. గీతలో శ్రీకృష్ణుడు 'స్వధర్మం' అన్నాడు. స్వధర్మం అంటే... ఈ క్షణంలో, నీ ఎదురుగా ఉన్న పరిస్థితిలో, ఏది 'సత్యమో', ఏది చేయాలో నీ విచక్షణ (intellect) తో తెలుసుకుని దాన్ని ఆచరించడం.
గీతలో కృష్ణుడు ఇంకో మాట అంటాడు: "పరధర్మో భయావహః". ఎవడో ఎప్పుడో క్రియేట్ చేసిన ఒక చెత్త ఆచారాన్ని తీసుకొచ్చి, గుడ్డిగా దాన్ని నెత్తిన పెట్టుకుని మోయడాన్ని 'పరధర్మం' అంటారు. అంటే నీకు సంబంధం లేని, నీకు అవగాహన లేని ధర్మం. ఈ పరధర్మం సొసైటీని నాశనం చేస్తుంది అన్నాడు. ఈరోజు మనం చూస్తున్నది అదే.
Chapter 5: నీకు ఇంకా ప్రూఫ్ కావాలా? (The Hypocrisy Unveiled)
మనం 'ధర్మం' పేరుతో ఎంత దారుణమైన పనులు చేస్తున్నామో, మనకు మనమే ఎంత గొప్పగా అబద్ధాలు చెప్పుకుంటున్నామో తెలుసా?
- 1. 50 అడుగుల దేవుడు - చచ్చిపోతున్న చెరువులు: మనం 50 అడుగుల విగ్రహాలు పెడతాం. ఎవరు పెద్ద విగ్రహం పెడితే వాళ్ళకి అంత భక్తి ఉన్నట్టు ఫీలింగ్. ఆ విగ్రహాలు Plaster of Paris (POP), లెడ్, మెర్క్యూరీ లాంటి toxic chemicals తో చేస్తారు. తొమ్మిది రోజులు పూజలు చేసి, పదివ రోజు ఆ 'ప్రాణం ఉన్న దేవుడిని' తీసుకెళ్లి మురుగు నీళ్ళలో పడేస్తాం. ఆ chemicals వల్ల లక్షలాది చేపలు ఊపిరాడక చచ్చిపోయి పైకి తేలుతాయి. ఆ చేపలకి ప్రాణం ఇచ్చింది నువ్వు పూజించే ఆ భగవంతుడే అని నీకు తెలిస్తే... ఆయన ప్రాణాలనే తీసుకెళ్లి ఆయన సృష్టించిన ప్రకృతిని నాశనం చేయడానికి వాడతావా?
- 2. సూర్య గ్రహణం - చెత్త కుండీలో దేవుడి ప్రసాదం: భూమికి, సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తే నీడ పడుతుంది, దాన్ని సూర్య గ్రహణం అంటారు. ఇది ఒక normal astronomical event. కానీ మనం ఏం చేస్తాం? 'రాహువు మింగేస్తున్నాడు, దోషం' అని ఇంట్లో ఉన్న కిలోల కొద్దీ అన్నాన్ని తీసుకెళ్లి చెత్తకుండీలో పడేస్తాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటావు. మరి అదే అన్నాన్ని తీసుకెళ్లి చెత్త కుండీలో పడేస్తావా? నీకు 'ఆకలి' కంటే నీ 'భయం' ఎక్కువ.
- 3. కరోనా సెకండ్ వేవ్ - తల్లి గంగానది ఏమైంది?: అన్నిటికంటే brutal truth ఇది. 2021 లో కరోనా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు, జనాలు పిట్టల్లా రాలిపోయారు. ఏ 'గంగా మాత' కి అయితే హారతులు ఇచ్చారో, అదే గంగా నదిలో వేలాది శవాలని పాలిథిన్ కవర్లలో చుట్టి పసిపిల్లల్లాగా విసిరేశారు. (2021 మే నెలలో BBC, Reuters లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు పక్కా ఆధారాలతో దీన్ని రిపోర్ట్ చేశాయి). ఎక్కడికి పోయింది అప్పుడు నీ భక్తి? నీకు కష్టం వచ్చినప్పుడు, నువ్వు పూజించే గంగామాత నీకు ఒక Dumping yard లాగా కనిపించిందా?
Chapter 6: The True Anti-Hindu (సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్న సైలెంట్ కిల్లర్స్)
ఇది చెప్పిన వెంటనే నాకు ఒక ట్యాగ్ వేయడానికి రెడీ అవుతారు మన ఇంటెలెక్చువల్స్. నువ్వు ఏ లాజికల్ క్వశ్చన్ అడిగినా సరే... "వీడు Anti-Hindu రా, వీడు సనాతన ధర్మానికి వ్యతిరేకి" అని ఒక ఫేక్ స్టాంప్ వేసేస్తారు.
అంటే వీళ్ళ ఉద్దేశ్యంలో... "హిందూ ధర్మం అంటేనే అంధవిశ్వాసం, పర్యావరణ వినాశనం" అన్నమాట! ఒక మూఢనమ్మకాన్ని క్వశ్చన్ చేస్తే, హిందూ మతం మొత్తం కుప్పకూలిపోతుంది అని వీళ్ళే ఇండైరెక్ట్‌గా ఒప్పుకుంటున్నారు. ఒక మతాన్ని ఇంతకంటే దారుణంగా ఇంకెవడైనా అవమానించగలడా?
వీళ్ళే అసలైన హిందూ ద్రోహులు. కొంచెం బుర్ర ఉన్న యువత అసలు గుడి వైపు ఎందుకు రావట్లేదు? ఎందుకంటే, ఏ లాజిక్ లేని ఆచారాలు, ప్రకృతిని నాశనం చేసే పద్ధతులకి మీరు 'సనాతన ధర్మం' అని లేబుల్ వేశారు. వాళ్ళు ధర్మానికి దూరంగా పారిపోవడానికి కారణం వెస్ట్రన్ కల్చరో ఇంకోటో కాదు... మీ అజ్ఞానమే! You are the best brand ambassadors of atheism.
అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? వేదాలు, ఉపనిషత్తులు, గీత... ఇవి మన ధర్మం. అందులో ఎక్కడైనా "ప్రకృతిని నాశనం చెయ్, గుడ్డి నమ్మకాలని నెత్తికెత్తుకో" అని రాసి ఉందా? ఖచ్చితంగా లేదు.
Chapter 7: The Core Psychology - ఎందుకు మనిషి ఇలా తయారయ్యాడు?
అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో ఒక లోతైన సైకలాజికల్ ఫాక్ట్ చెప్తాను వినండి. మనిషికి 'సత్యం' (Truth) అంటే చాలా భయం. ఎందుకంటే సత్యం నీ ముందు నిలబడినప్పుడు, అది నిన్ను ప్రశ్నిస్తుంది. "నువ్వు నిజాయితీగా బ్రతుకుతున్నావా? నీ లోపల ఉన్న కుళ్ళు ఏంటి?" అని సత్యం నిన్ను నిలదీస్తుంది. ఆ సత్యాన్ని ఫేస్ చేసే ధైర్యం మనకి లేదు.
అందుకే మనం ఒక అద్భుతమైన ఎస్కేప్ రూట్ (Escape route) కనిపెట్టాం. సత్యం వైపు వెళ్లకుండా ఉండటానికి, దేవుడికి 'ఆకారాలు', 'ఆచారాలు' ఇచ్చాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఏమీ అడగడు. ఈ సైకలాజికల్ ఎస్కేపిజం కి మనం పెట్టుకున్న ముద్దు పేరే 'సంప్రదాయం'.
నీకు నిజంగా నది మీద భక్తి ఉంటే, ఆ నదిని క్లీన్ చేయడానికి నువ్వు రోడ్డు మీదకి రావాలి. కాలుష్యం చేస్తున్న వాళ్లతో గొడవపడాలి. దానికి దమ్ము కావాలి. ఆ దమ్ము నీకు లేదు. నువ్వు పిరికివాడివి. అందుకే ఆ నదిలో పాలు పోసి, "నేను నా బాధ్యత తీర్చుకున్నాను" అని నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నావు. ఇది ఆచరణ కాదు, ఇది pure cowardice (పిరికితనం)!
Chapter 8: పోరాటం అంటే ఏంటో జ్యోతిబా పూలే గారిని అడగండి
ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో "మా సంప్రదాయాల్ని కాపాడుకోవడమే గొప్ప పోరాటం" అని ఫీల్ అవుతున్నారు. అసలైన యుద్ధం అంటే ఏంటో మహాత్మా జ్యోతిబా పూలే గారి జీవితం చూసి నేర్చుకోండి.
ఆయనకేం కష్టం వచ్చింది? డబ్బు ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. కానీ ఆయన బయటకొచ్చాడు. అత్యంత బలమైన వ్యవస్థ మీద, వేల ఏళ్లుగా పాతుకుపోయిన కుల వివక్ష మీద యుద్ధం ప్రకటించాడు. జనాల రాళ్లు, దెబ్బలు తిన్నాడు. ఎందుకంటే ఆయన కొట్లాడింది దేవుడి కోసం కాదు, మనిషి కోసం! ఒక 'నిజమైన శత్రువు' మీద కొట్లాడాడు.
ప్రతి యుగానికి ఒక కొత్త యుద్ధం ఉంటుంది. ఆయన ఆ రోజు అవిద్య మీద పోరాడాడు. ఈరోజు మన శత్రువులు పర్యావరణ వినాశనం, గుడ్డి నమ్మకాలు. మనం వీటి మీద కొట్లాడాలి. కానీ మనం మాత్రం పాత గాలి మరలతో యుద్ధం చేస్తూ, పనికిమాలిన ఆచారాల కోసం ప్రాణాలు ఇచ్చేస్తున్నాం.
దమ్ముంటే సత్యం ముందు నిలబడు!
అసలు హిందువు అంటే ఎవడు?
బొట్లు పెట్టుకుని, నదుల్లో పాలు పోసి, వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ దేవుడి బొమ్మలు ఫార్వర్డ్ చేసేవాడా? కాదు! హిందువు అంటే 'సత్యం' కోసం ప్రాణాలు ఇచ్చేవాడు. హిందువు తల కేవలం ఒకే ఒకరి ముందు వంగుతుంది... అదే 'శివుడు'.
శివుడు అంటే కైలాసంలో కూర్చుని నీ పాలు, నీ కొబ్బరికాయలు తీసుకునే ఒక బిజినెస్ మ్యాన్ కాదు. శివుడు అంటే "సత్యం, శివం, సుందరం". ఏది సత్యమో, అదే శివం! ఎవడైతే సత్యం ముందు మాత్రమే తల వంచుతాడో, ఎవడైతే తన చుట్టూ ఉన్న అబద్ధాలని, పనికిమాలిన ఆచారాలని, తన లోపల ఉన్న అహంకారాన్ని నిర్దాక్షిణ్యంగా కోసి పక్కన పడేస్తాడో... వాడు మాత్రమే నిజమైన సనాతని!
సో, ఛాయిస్ నీదే. సత్యం ముందు నిలబడే దమ్ము, శివుడి ముందు తల వంచే నిజాయితీ నీకు ఉంటే... ముందు నీ బుర్రకి పట్టిన ఈ తుప్పు వదిలించుకో. ప్రశ్నించడం మొదలుపెట్టు. ప్రతి ఆచారం వెనుక ఉన్న 'ఎందుకు' ని లాగి బయటపెట్టు.
లేదు, నేను ఇలాగే గొర్రెలాగా ఫాలో అవుతాను అనుకుంటే... go ahead! కానీ దయచేసి దానికి 'సనాతన ధర్మం' అనే పవిత్రమైన ముసుగు వేసి ఆ పదాన్ని ఖూనీ చేయకు. దాన్ని నీ భయం అనుకో, నీ బిజినెస్ డీల్ అనుకో, నీ అహంకారం అనుకో... కానీ ధర్మం అని మాత్రం అనకు.
నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది... కానీ ఆ చేదు మింగితేనే నీకు పట్టిన రోగం నయమవుతుంది. ఆలోచించు!
-PRATIKULA VEDAM
Comments
Post a Comment