Men vs Women: వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరికి బాధితులు? The Dark Reality of Victim Card
ఎటు చూసినా ఒకటే గోల. ఒక పక్క మగవాళ్ళ ఆధిపత్యం వల్ల ఆడవాళ్లు నలిగిపోతున్నారని కొందరు ఏడుస్తుంటారు. ఇంకో పక్క తప్పుడు చట్టాల వల్ల మగవాళ్లు బలైపోతున్నారని, మనకూ ఒక 'Men's Commission' కావాలని ఇంకొందరు పోరాడుతుంటారు. ఈ రెండు వర్గాల వాదనలు వింటుంటే నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే, వీళ్ళంతా పైపైన కనిపించే గాయాలకు మందు రాస్తున్నారు కానీ, లోపల కుళ్ళిపోతున్న అసలు జబ్బు గురించి ఎవరూ మాట్లాడటం లేదు.
నేను ఏ విషయాన్నీ గుడ్డిగా నమ్మను. పైపైన కనిపించే నాటకాలను చీల్చుకుని లోపలికి వెళ్ళి చూడటం నాకిష్టం. ఈ రోజు ఒక పచ్చి నిజాన్ని, ఒక చేదు నిజాన్ని మీ ముందు పెడుతున్నాను. మీ Ego దెబ్బతిన్నా సరే, వాస్తవాన్ని నిర్దాక్షిణ్యంగా విశ్లేషిద్దాం.
సమాజంలో ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరూ తాము 'బాధితులం' (Victims) అని చెబుతున్నారు. ఇద్దరికీ అన్యాయం జరుగుతోందట. మరి ఇద్దరూ బాధితులే అయితే, అసలు అన్యాయం చేస్తున్నది ఎవరు? ఆ దాడి చేస్తున్నది ఎవరు?
మనందరికీ ఒక భయం. ఎక్కడ నా మీద దాడి జరుగుతుందో, ఎక్కడ నేను మోసపోతానో, ఎక్కడ నా partner నన్ను వాడేస్కుంటదో అని. ప్రతి మనిషీ తాను ఎక్కడ బాధితుడు అయిపోతాడో అని భయపడుతున్నాడు. ఒకవేళ ప్రతి వ్యక్తీ తాను ఎక్కడ మోసపోతానో అని భయపడుతుంటే... దాని అర్థం ఏమిటి? తనను తాను 'పవిత్రుడిగా', 'తప్పు చేయనివాడిగా' declare చేసుకుంటున్నట్లే కదా? "నేను ఎవరికీ హాని చేయను, కానీ ప్రపంచమే నాకు హాని చేస్తుంది" అని మనల్ని మనం నమ్మించుకుంటున్నాం.
మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఒక accident కనిపిస్తుంది. ఒకడు రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉంటాడు. ఇంకొకడు వాడిని గుద్ది పారిపోయి ఉంటాడు. ఆ దృశ్యం చూడగానే మనకు ఏమనిపిస్తుంది? "అయ్యో, రేపు నాక్కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో" అని భయపడతాం. అంటే, ఆ రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడి ప్లేస్ లో మనల్ని మనం ఊహించుకుంటాం. కానీ ఏ ఒక్కరోజైనా... "ఆ గుద్ది పారిపోయిన కిరాతకుడి ప్లేస్ లో నేనుంటానేమో?" అని మీకు ఆలోచన వచ్చిందా? రాదు. ఎందుకంటే మన అహంకారం (Ego) మనల్ని ఎప్పుడూ విలన్ గా చూడనివ్వదు.
Horror సినిమాలు చూస్తున్నప్పుడు కూడా మనల్ని దెయ్యం పట్టుకుంటుందేమో అని భయపడతామే కానీ, మనమే ఆ దెయ్యం లాగా, ఆ రాక్షసుడి లాగా మరొకరిని హింసిస్తామేమో అని ఎప్పుడూ అనుకోము.
దీని వెనుక ఉన్న Psychology ఏమిటో తెలుసా? "నాకు అన్యాయం జరిగింది, నేను బాధితుడిని" అని మీరు ఎప్పుడైతే decide చేసుకుంటారో, అప్పుడే మీరు రేపు మరొకరి మీద దాడి చేయడానికి ఒక license తీసుకుంటున్నారని అర్థం. ఇది చాలా ప్రమాదకరమైన mind set.
మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఒక accident కనిపిస్తుంది. ఒకడు రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉంటాడు. ఇంకొకడు వాడిని గుద్ది పారిపోయి ఉంటాడు. ఆ దృశ్యం చూడగానే మనకు ఏమనిపిస్తుంది? "అయ్యో, రేపు నాక్కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో" అని భయపడతాం. అంటే, ఆ రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడి ప్లేస్ లో మనల్ని మనం ఊహించుకుంటాం. కానీ ఏ ఒక్కరోజైనా... "ఆ గుద్ది పారిపోయిన కిరాతకుడి ప్లేస్ లో నేనుంటానేమో?" అని మీకు ఆలోచన వచ్చిందా? రాదు. ఎందుకంటే మన అహంకారం (Ego) మనల్ని ఎప్పుడూ విలన్ గా చూడనివ్వదు.
Horror సినిమాలు చూస్తున్నప్పుడు కూడా మనల్ని దెయ్యం పట్టుకుంటుందేమో అని భయపడతామే కానీ, మనమే ఆ దెయ్యం లాగా, ఆ రాక్షసుడి లాగా మరొకరిని హింసిస్తామేమో అని ఎప్పుడూ అనుకోము.
దీని వెనుక ఉన్న Psychology ఏమిటో తెలుసా? "నాకు అన్యాయం జరిగింది, నేను బాధితుడిని" అని మీరు ఎప్పుడైతే decide చేసుకుంటారో, అప్పుడే మీరు రేపు మరొకరి మీద దాడి చేయడానికి ఒక license తీసుకుంటున్నారని అర్థం. ఇది చాలా ప్రమాదకరమైన mind set.
నేటి బాధితుడే... రేపటి విలన్
చరిత్రను, సమాజాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి "నాకు అన్యాయం జరుగుతోంది" అని అరిచి చెబుతున్నాడంటే, వాడు లోపల పగ పెంచుకుంటున్నాడు, ఛాన్స్ దొరికినప్పుడు మరొకరిని చావబాదడానికి రెడీ అవుతున్నాడు అని అర్థం.
ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఘోరాలకు కూడా కారణం ఇదే. మీరు హిట్లర్ దగ్గరకు వెళ్లి "లక్షలాది మంది యూదులను గ్యాస్ చాంబర్లలో ఎందుకు పెట్టి చంపావు?" అని అడిగితే వాడు ఏమంటాడు? "నేను రాక్షసుడిని కాబట్టి చంపాను" అని అనడు. "యూదులు జర్మనీని దోచుకున్నారు, జర్మన్లకి అన్యాయం చేశారు, నేను కేవలం లెక్క సరిచేశాను, బ్యాలెన్స్ తీసుకొచ్చాను" అంటాడు. అంటే, అంతటి నరమేధాన్ని కూడా తాను 'బాధితుడిని' అనే లాజిక్ తోనే కవర్ చేసుకున్నాడు.
అమెరికా వాడిని అడిగితే "రష్యా కుట్రలు చేస్తోంది, మేం బాధితులం" అంటాడు. నాటో (NATO) పెట్టడానికి అదే రీజన్ చెబుతాడు. రష్యా వాడిని అడిగితే అమెరికాను చూపిస్తాడు. ఈ గొడవల్లో ప్రతివాడూ తాను బాధితుడినే అంటాడు.
ఆడ-మగ మధ్య జరుగుతున్నది కూడా అక్షరాలా ఇదే. ఎవరైతే ఈ రోజు "నేను బాధితుడిని" అంటున్నారో, వాళ్ళే రేపటి విలన్లు. ఇది రాసిపెట్టుకోండి. ఎందుకంటే, అన్యాయాన్ని భరించే లక్షణం, అన్యాయం చేసే లక్షణం... ఈ రెండూ మన లోపల ఉన్న ఒకే 'జంతువు' (Beast) తాలూకు రెండు ముఖాలు. మనం చట్టాల గురించి, రూల్స్ గురించి మాట్లాడుతాం కానీ, మనిషి లోపల దాక్కున్న ఆ జంతువు గురించి ఎవరూ మాట్లాడరు. ఆ జంతువు మగవాడిలోనూ ఉంది, ఆడవాడిలోనూ ఉంది. ఇద్దరిలోనూ సమానంగా ఉంది. నిన్న ఆడవాళ్ళ మీద ఫిజికల్ గా అణచివేత జరిగితే, ఈ రోజు ఆమె తిరిగి దాడి చేస్తోంది.
డైరెక్ట్ హింస (Active Violence) vs సైలెంట్ హింస (Passive Violence)
నేను ఒక స్ట్రెయిట్ ప్రశ్న అడుగుతాను. మహాభారతంలో దుశ్శాసనుడిని చంపింది భీముడా? ద్రౌపదా?
పైకి చూస్తే భీముడు తన చేతులతో దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం తాగాడు. అది చూసి మనం "అమ్మో, భీముడు ఎంత క్రూరుడు" అనుకుంటాం. కానీ ఆ హింస వెనుక ఉన్నది ఎవరు? ఆ రక్తాన్ని తీసుకొచ్చి తన జుట్టుకు రాసుకుంటే తప్ప జడ ముడివేయను అని కండిషన్ పెట్టింది ద్రౌపది.
అంటే భీముడు చేసింది 'Active Violence'. వాడి దగ్గర కండబలం ఉంది కాబట్టి వాడు నేరుగా దాడి చేశాడు. ద్రౌపది దగ్గర కండబలం లేదు కాబట్టి ఆమె 'Passive Violence' చేసింది. అంటే వెనుక ఉండి నడిపించింది.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే... ఎవరి దగ్గరైతే శారీరక బలం, డబ్బు లేదా చట్టపరమైన సపోర్ట్ తక్కువగా ఉంటుందో, వాళ్ళు 'Passive Violence' చేస్తారు. అదే వాళ్ళకి ఆ పవర్ రాగానే, వాళ్ళు 'Active Violence' కి దిగుతారు. హింస అనేది ఇద్దరిలోనూ ఉంది. అణగదొక్కబడేవాడు, అణగదొక్కేవాడు అని ఎవరూ లేరు. ఇదంతా ఒక నాటకం. Power లేనప్పుడు Silent గా వెన్నుపోటు పొడుస్తారు, Power రాగానే ఎదురుగా వచ్చి దాడి చేస్తారు.
ఈ రోజు రోడ్ల మీద కూడా మనం చూస్తున్నాం. ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ అయితే, ఆడవాళ్లు విపరీతంగా రెచ్చిపోయి మగవాళ్ళ మీద చేయి చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో చూశాం. Power balance మారగానే, లోపల ఉన్న కోపం, హింస ఎలా బయటపడుతుందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.
ఈ మొత్తం గొడవను ఆపడానికి చట్టాలు, సెక్షన్లు ఏమాత్రం సరిపోవు. పైపైన Ointment రాస్తే Cancer తగ్గదు.
ఆడవాళ్లకైనా, మగవాడికైనా లోపల ఉన్నది ఒకటే mind set. బయట శరీరాలు మాత్రమే వేరు. ఒక మగవాడికి సర్జరీ చేసి అతన్ని ఆడదిగా మార్చేస్తే, నిన్నటి దాకా వాడు ఏ ఆడవాళ్ళనైతే చూసి "వీళ్ళు దారుణంగా behave చేస్తున్నారు, మమ్మల్ని torture చేస్తున్నారు" అని ఎవరు తిట్టారో ... రేపు వాడే ఆ పనులన్నీ చేస్తాడు. ఎందుకంటే, మనిషి లోపలి బుద్ధి మారలేదు, కేవలం బయట శరీరం మాత్రమే మారింది.
అందుకే మనం 'Men's Day' అని జరుపుకోకూడదు. దానికంటే మనుషుల ఆలోచనా విధానాన్ని, లోపలి చైతన్యాన్ని మార్చే రోజుగా జరుపుకోవాలి.
ఒక ఇంట్లో భార్యాభర్తలు ఎందుకు గొడవ పడుతున్నారో మీకు అర్థమైతే, ప్రపంచంలో రెండు దేశాల మధ్య యుద్ధం ఎందుకు జరుగుతోందో కూడా మీకు ఇట్టే అర్థమైపోతుంది.
ఎందుకంటే ప్రాబ్లమ్ ఆడ-మగ మధ్య లేదు. ప్రాబ్లమ్ మానవ మనస్సులో ఉంది. అహంకారంలో ఉంది.
మన గురించి మనకు కనీస క్లారిటీ లేదు. మన లోపల ఒక భయంకరమైన అశాంతి ఎప్పుడూ రగులుతూ ఉంటుంది. ఆ లోపలి చీకటే, బయట హింసగా మారుతుంది. లోపల ఏదో వెలితిగా ఉంటుంది కాబట్టి, ఎదుటివాడిని పీక్కుతిని, వాడి దగ్గర ఉన్నది లాక్కుని ఆ వెలితిని కవర్ చేసుకుందాం అని మనిషి ఆరాటపడతాడు.
ఆ ఆరాటంలోనే మగవాడు ఆడదానిపై దాడి చేస్తాడు. ఆడవాళ్లు కూడా మగవాళ్ళను సమానంగా టార్చర్ చేస్తారు. ఒకవేళ ఇద్దరూ రాజీపడి, చట్టాలకు భయపడి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ఆపేశారనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇద్దరూ కలిసి ఈ భూమి మీద దాడి చేస్తారు. ప్రకృతిని నాశనం చేస్తారు.
ఈ రోజు మనం చూస్తున్న Climate Change, అడవుల నాశనం... ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? మనిషి లోపల ఉన్న ఆ అశాంతి, ఆ క్రూరత్వం, తోటి మనిషి మీద చూపించలేక, భూమి మీద, ప్రకృతి మీద చూపిస్తున్నారు.
మరి Solution ఎక్కడ ఉంది?
బ్యాలెన్స్ (Balance) అంటే అర్థం... నువ్వు నన్ను వంద సార్లు కొట్టావు కాబట్టి, ఇప్పుడు నేను నిన్ను వంద సార్లు కొడతాను అని కాదు. "అప్పుడు ఆడవాళ్ళు బలైపోయారు, ఇప్పుడు మగవాళ్ళను బలి చేద్దాం" అనుకోవడం మూర్ఖత్వం.నిజమైన సొల్యూషన్ ఆధునిక చట్టాల్లో లేదు, మన మైండ్ సెట్ ను మార్చుకోవడంలో ఉంది. చిన్నప్పటి నుండే పిల్లలకు తమ మనస్సు ఎలా పనిచేస్తుందో, Ego ఎలా మోసం చేస్తుందో నేర్పించాలి. మన లోపల ఉన్న 'హింస' అనే అసలు కారణాన్ని తీసేయకపోతే, రేపు ఒక మనిషి మరొక మనిషిని కాదు కదా, తనను తాను కూడా చీల్చుకుని తినేస్తాడు.
కళ్ళు తెరవండి. Victim Card ఆడటం ఆపండి. మీ కష్టాలకు, మీ బాధలకు బయట ఎవరో కారణం కాదు, మీ అజ్ఞానమే (Ignorance) కారణం. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం అలవాటు చేసుకోండి. అర్థం చేసుకోగలిగితే ఇది మీకు ఒక విముక్తి. లేదంటే, ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తూ, కోర్టుల చుట్టూ, కేసుల చుట్టూ తిరుగుతూ జీవితాలు నాశనం చేసుకోండి. ఛాయిస్ మీదే.
-PRATIKULA VEDAM
.jpg)
It's amazing
ReplyDeleteచాలా బాగుంది.మంచి సందేశాన్ని అందించారు
ReplyDeleteఇది ఒప్పుకోవటానికి కూడా మన ego అడ్డువస్తాధి. అంత గొప్పోల్లం మనం
ReplyDelete