పెళ్లి అంటే ప్రేమా? భయమా? | Marriage Psychology Telugu
పెళ్లి: మానవ మేధస్సు సాధించిన అత్యద్భుతమైన ఆత్మహత్య! (The Grand Illusion)
ప్రపంచంలో అతిపెద్ద భయం ఏంటో తెలుసా? దెయ్యం కాదు... చీకటి కాదు... చావు అంతకన్నా కాదు. మనిషికి ఉన్న అతిపెద్ద భయం... "తనతో తాను ఒంటరిగా ఒక గదిలో కూర్చోవడం."
నీ థాట్స్ తో నువ్వు ఒంటరిగా ఒక ఐదు నిమిషాలు కూర్చోలేవు. నీలో ఉన్న ఆ శూన్యం, ఆ Emptiness నిన్ను భయపెడుతుంది. ఆ భయాన్ని, ఆ ఖాళీతనాన్ని కవర్ చేసుకోవడానికి నీకు ఒక మనిషి కావాలి. నీ చెత్తను భరించడానికి, "నువ్వున్నావు" అని నీకు పదే పదే గుర్తుచేయడానికి ఒక మనిషి కావాలి. ఆ భయం, ఆ పిరికితనం నుంచి పుట్టిన అత్యంత స్వార్థపూరితమైన సిస్టమ్ పేరే... "Marriage".
చరిత్రలో ఎందరో నియంతలు, రాజులు మనుషులను బానిసలుగా మార్చడానికి యుద్ధాలు చేశారు, కొరడాతో కొట్టారు. కానీ ఈ సొసైటీ డిజైన్ చేసిన "Marriage" అనే సిస్టమ్ ఎంత అద్భుతమైనదంటే... ఇక్కడ మిమ్మల్ని ఎవరూ బలవంతంగా పట్టుకొచ్చి జైలులో వేయరు. మీ మెడకు మీరే ఉరితాడు బిగించుకుని, దానికి ‘మాంగళ్యం’ అని ముద్దుపేరు పెట్టుకుని, ఒక వెయ్యి మందిని పిలిచి బిర్యానీలు పెట్టి... మీ బానిసత్వాన్ని మీరే అట్టహాసంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
Chapter 1: 25 ఏళ్లకే జీవితకాలపు డీల్స్ - (మారే మనిషి, మారని పెళ్లి)
ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించు. నీ వయసు 24, 25 లేదా 28. నిజం చెప్పు... నీకు నీ గురించి ఏం తెలుసు? నిన్ను నువ్వు ఎప్పుడైనా పూర్తిగా అర్థం చేసుకున్నావా?
రాత్రి ఏడు గంటలకి కూర్చుంటే బుక్ చదవాలో, వెబ్ సిరీస్ చూడాలో డిసైడ్ చేసుకోలేని కన్ఫ్యూజన్ నీది.
ఒక రెస్టారెంట్ కి వెళితే మెనూ కార్డ్ అరగంట చూసి కూడా ఏం ఆర్డర్ చేయాలో తెలియని దరిద్రమైన Decision Making నీది. కానీ... ఒక అపరిచిత వ్యక్తిని తీసుకొచ్చి, "ఇక నుంచి నా 50 ఏళ్ల జీవితం నీతోనే, నా ప్రైవసీ నీదే, నా బెడ్ రూమ్ నీదే" అని జీవితకాలపు అగ్రిమెంట్ మీద ఎలా సైన్ చేసేస్తున్నావ్?
ఒకసారి నీ గతంలోకి వెళ్లి చూసుకో. 2014లో, అంటే నీకు ఒక 15 ఏళ్లు ఉన్నప్పుడు నువ్వు ఫేస్బుక్ లో పెట్టిన పోస్టులు, 'Attitude boy', 'Attitude Girl' అని పెట్టుకున్న బయోలు చూడు. ఇప్పుడు అవన్నీ చూసుకుంటే నీకే సిగ్గేసి, 'ఛీ ఛీ, అప్పట్లో నేను ఇంత ఎదవలా ఉండేవాడినా' అని అనిపిస్తుందా లేదా? కచ్చితంగా అనిపిస్తుంది! ఎందుకంటే పదేళ్లలో నువ్వు మారావు. నీ మెచ్యూరిటీ లెవెల్స్ మారాయి. అప్పట్లో నీకు పిచ్చిగా నచ్చినవి ఇప్పుడు నచ్చట్లేదు.
మరి పదేళ్లకే నీ ఆలోచనలు అంతలా మారిపోయినప్పుడు... ఈరోజు నువ్వు 'వీడే నా ప్రపంచం, ఈమే నా దేవత' అని ఏడు జన్మల కోసం ఒక అగ్రిమెంట్ రాసిచ్చేస్తున్నావే, ఇంకో పదేళ్ల తర్వాత అదే మనిషి నీకు నచ్చకపోతే? నీ ఆలోచనలకు వాళ్ళ ఆలోచనలకు సింక్ అవ్వకపోతే? పదేళ్ల క్రితం కొన్న ప్యాంటు టైట్ అయితే పక్కన పడేసే నువ్వు... పదేళ్ల క్రితం చేసుకున్న పెళ్లి ఊపిరాడకుండా చేస్తుంటే, వదిలించుకునే దమ్ముందా నీకు? లేదు! ఎందుకంటే, మనుషులు మారతారు అనే లాజిక్ ని ఈ 'పెళ్లి' ఒప్పుకోదు. నువ్వు మారినా సరే, కుళ్ళి కుళ్ళి ఆ ఒకే గదిలో చావాల్సిందే అని శాసిస్తుంది.
Chapter 2: హార్మోన్ల నాటకానికి 'వేద మంత్రాల' ముసుగు!
మనం మనుషులం కదా, మనకి ఈగో (Ego) ఎక్కువ. మనం చేసే ప్రతి బయోలాజికల్ పనికి ఒక పవిత్రమైన రంగు పూయకపోతే మనకు నిద్రపట్టదు. ఒక వయసు రాగానే శరీరంలో హార్మోన్లు (Hormones) రిలీజ్ అవుతాయి. జీవశాస్త్రం ప్రకారం అది కేవలం ఒక లైంగిక ఆకర్షణ (Reproductive Urge). జంతువులు అయితే సింపుల్ గా పార్టనర్ ని వెతుక్కుంటాయి. కానీ మనకి సిగ్గు. "నేను జంతువుని కాదు, నాది కామం కాదు, నాది ప్రేమ, నాది పవిత్ర బంధం" అని కలరింగ్ ఇచ్చుకోవాలి.
ఎవరైనా "పెళ్లి ఎందుకు?" అని అడిగితే... "ఒకరికొకరు తోడుగా ఉండాలి, ముసలితనంలో ఒక గ్లాసు నీళ్లు ఇవ్వడానికి" అని పెద్ద డైలాగులు వేస్తావ్. బొక్కేమ్ గాదూ! ఒక చిన్న లాజికల్ క్వశ్చన్. నువ్వు చేసుకోబోయే అమ్మాయి/అబ్బాయికి ఫుల్ కేరింగ్ నేచర్ ఉంది. కానీ... వాళ్ళకు లైంగిక సామర్థ్యం (Sexual Capability) లేదని నీకు పీటల మీద తెలిసింది. పెళ్లి చేసుకుంటావా? చేసుకోవు కదా! లేచిపోయి పారిపోతావు. మరి ఆ తోడు, ఆ ఎమోషనల్ సపోర్ట్, ఆ ఏడు జన్మల బంధం లాంటి సినిమా డైలాగులన్నీ ఏమయ్యాయ్?
ఒక కారు ఉందనుకో. అందులో AC, Music System, కుషన్ సీట్లు ఉంటాయి. కారుని డిఫైన్ చేసేది ఏంటి? ఇంజిన్! పెళ్లిలో ఎమోషన్స్, సపోర్ట్ అనేవి కారులో AC లాంటి Accessories మాత్రమే. పెళ్లికి అసలైన ఇంజిన్, దాని సెంట్రల్ పాయింట్ - Sex. ఇది పచ్చి నిజం.
Chapter 3: 'బలహీనులు' చేసిన కుట్ర (The Rebellion of the Weak)
"స్వర్గంలో దేవుడు నిర్ణయించాడు" అని కథలు చెప్తారు. దేవుడికి వేరే పని లేదా? నీ లాంటి ఖాళీ బుర్ర గాడికి ఒక పిల్లను సెట్ చేయడానికి ఆయనేమైనా నీ బ్రోకరా?
ఎవల్యూషనరీ సైన్స్ (Evolutionary Science) ప్రకారం చూద్దాం. ప్రకృతి నియమం ఏంటి? "Survival of the Fittest". అడవిలో ఏది బలమైనదో దానికి మాత్రమే మేట్ దొరుకుతుంది. కానీ మనుషుల్లో శారీరకంగా, మానసికంగా, ఇంటలెక్చువల్ గా వీక్ గా ఉన్నవాళ్లు (Weak population) మెజారిటీ. వీళ్ళందరికీ ఒక భయం పట్టుకుంది. "ప్రకృతి నియమం ప్రకారం వదిలేస్తే, ఏ టాలెంట్ లేని నాకు మేట్ దొరకదు, వంశం అంతరించిపోతుంది అని."
అప్పుడు ఈ బలహీనులందరూ కలిసి డిజైన్ చేసిన ఒక Guaranteed Scheme పేరే... Arranged Marriage! "సొంతంగా ఒక అమ్మాయిని లేదా అబ్బాయిని ఆకర్షించే సత్తా లేని వాళ్ళ కోసం... సొసైటీ క్రియేట్ చేసిన ఒక Reservation System." నీకు ఏ టాలెంట్ అక్కర్లేదు. నువ్వు మా కులం, నీకు ఇంత జీతం ఉంది, కాబట్టి నీకు పెళ్లి అనే కోటాలో ఒక మనిషిని గ్యారెంటీగా ఇస్తాం. అంటే మీ పెళ్లి వెనుక ఉన్నది దైవత్వం కాదు, అది పనికిమాలిన వాళ్ల సర్వైవల్ కోసం, వాళ్లకి వాళ్ళే క్రియేట్ చేసుకున్న Scheme. కాదు కాదు.. SCAM.
మీరు దేన్ని "ప్రేమ" అంటున్నారో దాన్ని నేను "Mutual Parasitism" (పరస్పర పరాన్నజీవనం) అంటాను. ఒక మనిషికి సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఇంకో మనిషికి వంట మనిషి, శారీరక, లైంగిక అవసరాలు తీర్చే బాడీ, తన ఈగోను శాటిస్ఫై చేసే బానిస కావాలి. ఇద్దరు బిచ్చగాళ్లు ఎదురెదురుగా కూర్చుని... "నాకు కొంచెం ప్రేమ పెట్టు, నాకు కొంచెం కేరింగ్ పెట్టు" అని ఒకరినొకరు అడుక్కుంటున్న దరిద్రమైన బిచ్చగాళ్ల Barter System ఈ పెళ్లి.
Chapter 4: Identity Bankruptcy & The Princess Trap
నిన్ను నువ్వు ఒక ప్రశ్న వేసుకో. "నువ్వు ఎవరు?"
సొసైటీలో 99 శాతం మందికి ఒక "Individuality" లేదు. వాళ్ళకంటూ ఒక సెంటర్ లేదు. వాళ్ళు లోపల కంప్లీట్ గా బ్యాంక్రప్ట్. ఒక పెళ్లి కాగానే మనుషుల వాట్సాప్ డీపీ (WhatsApp DP) చూడు. పెళ్లికి ముందు వాడి డీపీ వాడే పెట్టుకుంటాడు. పెళ్లి కాగానే భార్యతో పెడతాడు. పిల్లలు పుట్టగానే డీపీలో పిల్లల ఫోటో ఉంటుంది, వీడు మాయం అయిపోతాడు! దీని అర్థం ఏంటో తెలుసా? వీడికంటూ సెపరేట్ గా సొంతంగా బతికే ధైర్యం లేదు. సింగిల్ గా ఫేస్ చేసే గట్స్ లేక, ఆ ఫ్యామిలీ చాటున దాక్కుంటున్నాడు.
ఇక ఆడపిల్లల సైకాలజీని మార్కెట్ ఎంత అద్భుతంగా వాడుకుంటుందో చూడండి. ఆడపిల్లలూ... మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో 'Priyanka Chopra', 'Katrina Kaif' లాంటి హీరోయిన్ల రాజస్థాన్ ప్యాలెస్ పెళ్లిళ్లు చూసి, మీ పెళ్లి కూడా అలాగే జరగాలి అని కలలు కంటారు కదా! ఆ హీరోయిన్లకి ఆ పెళ్లి అనేది ఒక 'PR Event'. వాళ్ళు వేసుకునే బట్టలకి బ్రాండ్స్ డబ్బులిస్తాయి. వాళ్ళ ఐడెంటిటీ మారదు.
కానీ నువ్వు? పది లక్షలు అప్పు చేయించి, ఒక లెహంగా కొనిపించుకుని, ఫేక్ ఫోటోషూట్ చేయించుకుంటావు. ఆ ఒక్క రోజు నీ చుట్టూ అటెన్షన్ ఉంటుంది. "On the wedding night, everybody is a Princess." ఆ ఒక్క రోజు కిక్ కోసం... తర్వాత వచ్చే 40 ఏళ్ల స్వేచ్ఛను గుడ్డిగా అమ్మేసుకుంటున్నావు. ఆ లైట్లు ఆరిపోయాక, మరుసటి రోజు ఉదయం ఆ లెహంగాని బీరువాలో పడేసి, ఎవరికోసమో ఏడుస్తూ ఉల్లిపాయలు కొస్కుంటు కూర్చోడమే.
(గమనిక: దీని వెనుక ఉన్న 'Victim Card' సైకాలజీ గురించి నా 'Men vs Women' విశ్లేషణలో క్షుణ్ణంగా చదవండి)
Chapter 5: డబుల్ స్టాండర్డ్స్ - ఆఫీస్ లో ఫ్రీలాన్సర్, ఇంట్లో బానిస!
ఈ మోడరన్ జనరేషన్ యూత్ హిపోక్రసీ పీక్స్ లో ఉంటుంది. మీకు ఆఫీస్ లో బాస్ కమాండ్ చేస్తే నచ్చదు. "I hate this 9 to 5 corporate slavery. నేను నా టర్మ్స్ మీదే బతుకుతా, I am a Freelancer!" అని కాలర్ ఎగరేస్తారు. అంటే ఒక కంపెనీలో రోజుకు 8 గంటలు పనిచేస్తే మీ స్వేచ్ఛ పోతుందని భయపడే మీరు... 24 గంటలు, సంవత్సరంలో 365 రోజులు, జీవితాంతం ఒకే మనిషికి కట్టుబడి ఉండటానికి ఎలా సిద్ధపడిపోతారు?
ఆఫీస్ లో నచ్చకపోతే రిజైన్ చేసి రేపు పొద్దున ఇంకో జాబ్ వెతుక్కోవచ్చు. కానీ పెళ్లి నచ్చకపోతే రిజైన్ చేసే ఆప్షన్ ఉందా? స్వేచ్ఛ ఎప్పుడూ తీవ్రమైన బాధ్యతతో వస్తుంది. ఇండిపెండెంట్ గా బతకడం అంటే నీ ఫెయిల్యూర్స్ కి నువ్వే పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఆ భారాన్ని మోయలేక, పర్సనల్ లైఫ్ లో మాత్రం, "దయచేసి నా మెడలో తాడు వేసి కట్టేయండి, నాకు ఆ బాధ్యత వద్దు" అని నువ్వే స్వయంగా వెళ్లి అప్పజెప్పుకుంటున్నావ్.
Chapter 6: 'Exit Barrier' & నవ్వుల వెనుక ఉన్న ఏడుపు
భారతదేశంలో ఒక కంపెనీ పెట్టడం ఈజీ, దాన్ని క్లోజ్ చేయడం కష్టం. పెళ్లి కూడా అంతే. రెండు కుటుంబాల మనుషులను పిలిచి ఒక రోజులో, పెళ్లి అనే తంతు ముగించేస్తారు. కానీ కొన్నాళ్ళకి?... ఆ ఇద్దరికీ ఒకరితో ఒకరు పడట్లేదు. లైఫ్ నరకంగా మారింది. విడిపోదాం అనుకుంటే?
ఇక్కడ స్టార్ట్ అవుతుంది సొసైటీ శాడిజం. మీరు అంత ఈజీగా విడిపోవడానికి వీల్లేదు. కోర్టు మెట్లు ఎక్కాలి. ఒకవేళ ఏ ఒక్కరికి ఈగో హర్ట్ అయినా ఆస్తుల పంపకాలు, తప్పుడు కేసులు (498A), పిల్లల కస్టడీ... జీవితం ఒక నరకం అవుతుంది. తప్పు చేశావ్ అని తెలిసినా సరే, జీవితాంతం ఆ తప్పుతోనే బతుకుతూ కుళ్ళి చావాల్సిందే!
అందుకే... వాట్సాప్ ఫార్వర్డ్ ల దగ్గర్నుంచి, స్టాండప్ కామెడీ వరకు ఎక్కడ చూసినా అత్యధికంగా పేలే జోకులు "భార్యాభర్తల" మీదే ఉంటాయి. బ్రహ్మానందాన్ని కోవై సరళ కొడుతుంటే మనం పడి పడి నవ్వుతాం. సైకాలజీలో దీన్నొక "Defense Mechanism" అంటారు. మన జీవితంలో ఉన్న భయంకరమైన నిజాన్ని మనం డైరెక్ట్ గా ఫేస్ చేయలేనప్పుడు, దాన్ని ఒక కామెడీగా మార్చి నవ్వేసుకుంటూంటాం.
Chapter 7: క్యాపిటలిజం కుట్ర & ది ఇమ్మోర్టాలిటీ ప్రాజెక్ట్
సమాజం, ప్రభుత్వాలు ఎందుకు పదే పదే "పెళ్లి చేసుకోండి" అని నీ బ్రెయిన్ వాష్ చేస్తాయో తెలుసా? ఎందుకంటే Marriage is the biggest engine of Capitalism.
ఒక మనిషి సింగిల్ గా ఉంటే వాడికి ఎక్కువ అవసరాలు ఉండవు. మార్కెట్ కి బిజినెస్ జరగదు. కానీ పెళ్లి అనే తాడు వేస్తే? డబుల్ కాట్ బెడ్, ఫ్రిడ్జ్, డైపర్లు, ప్రీ-స్కూల్ ఫీజులు, కారు, దానికి EMI, హోమ్ లోన్. క్యాపిటలిజం కి ఒక జీవితకాలపు బానిస దొరికినట్టే.
దీనికి తోడు "Immortality Project". మనిషికి తనకి విలువే లేదు (Insignificance) అని యాక్సెప్ట్ చేసే ధైర్యం లేదు. తాను చచ్చిపోయినా తన పేరు బతకాలి అనే ఈగోతో పిల్లల్ని కంటాడు. అంటే పిల్లల్ని కనేది ప్రేమతో కాదు, నీ చావు భయంతో వేసుకునే ఇన్సూరెన్స్ పాలసీ అది.
Chapter 8: The Ultimate Logical Takedown
ఇన్ని నిజాలు చెప్పాక కూడా, మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడానికి నాలుగు లాజిక్స్ చెబుతారు. ఆ లాజిక్స్ ని కూడా ముక్కలు చేద్దాం:
Logic 1: "తోడు కోసం, ఎమోషనల్ సపోర్ట్ కోసం!"
ఎవరినైనా పెళ్లి ఎందుకురా అంటే... "మనిషి అన్నాక ఒక తోడు కావాలి సార్. ఎమోషనల్ సపోర్ట్ (Emotional Support) కావాలి. రేపు ముసలితనం వచ్చాక ఒక గ్లాసు నీళ్లు ఇవ్వడానికి ఒక మనిషి ఉండాలి కదా... అందుకే ఈ పవిత్ర బంధం" అంటారు.
వినడానికి ఎంత అద్భుతంగా ఉంది కదా!
మరి నీ లాజిక్ ప్రకారమే చూసుకుంటే... పెళ్లి అనేది కేవలం ఎమోషనల్ సపోర్ట్ కోసం, ముసలితనంలో తోడు కోసం మాత్రమే అయితే... నీకు ఎదుటి మనిషి క్యారెక్టర్, వాళ్ళ కేరింగ్ నేచర్ మాత్రమే ముఖ్యం కావాలి కదా? వాళ్ళ కులం ఏంటో నీకనవసరం. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ (Bank Balance) నీకనవసరం. వాళ్ళు ఏ రంగులో ఉన్నారో నీకనవసరం. జస్ట్ ఒక మంచి మనిషి దొరికితే చాలు, వెళ్లి ఒక దండ వేసి జీవితం స్టార్ట్ చేయాలి కదా?
అలా చేస్తున్నారా? లేరు! అమ్మాయికి ఎంత ఆస్తి వస్తుందో కావాలి, అబ్బాయికి నెలకు ఎంత ప్యాకేజీ (Package) వస్తుందో కావాలి, కులం కలవాలి, జాతకాలు కలవాలి. పీటల మీద కూర్చున్నాక ఎదుటి మనిషికి 'సెక్స్' (Sex) చేసే కెపాసిటీ లేదని తెలిస్తే... ఆ 'తోడు' ని, ఆ 'ఎమోషనల్ సపోర్ట్' ని పీటల మీదే వదిలేసి పారిపోతారు. అంటే మీ పెళ్లి వెనుక ఉన్నది తోడు కాదు... కామం, డబ్బు!
పోనీ... ప్రాక్టికల్ ప్రపంచం కదా, బతకడానికి డబ్బు కావాలి, కోరికలు తీరడానికి శరీరం కావాలి, స్వార్థం ఉంటుంది కదా మనిషన్నాక అంటావా?... సరే!
Logic 2: "మాది రెండు కుటుంబాల కలయిక!"
"మా పెళ్లి కేవలం ఇద్దరు మనుషులది కాదు, రెండు ఫ్యామిలీలు కలిసి ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. కుటుంబం పరువు కోసం చేస్తున్నాం" అంటారు.
మరి నీ లాజిక్ ప్రకారమే, రెండు కుటుంబాలు గౌరవంగా కలుస్తున్నప్పుడు... ఆ రెండు కుటుంబాలకు సమానమైన వాల్యూ ఉండాలి కదా? ఇద్దరి వైపు నుంచి సమానమైన త్యాగాలు ఉండాలి కదా? పెళ్లి అవ్వగానే ఇద్దరూ కలిసి ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలి కదా?
అలా జరుగుతోందా? లేదు! ఒక ఆడపిల్ల తన ఇంటిని వదిలేయాలి. తన ఇంటి పేరు మార్చుకోవాలి. తన తల్లిదండ్రులను వదిలేసి, నీ ఇంట్లోకొచ్చి నీ తల్లిదండ్రులకు సేవ చేయాలి. తన సొంత ఇంట్లోనే ఆమె ఒక గెస్ట్ (Guest) లా మారిపోతుంది. అబ్బాయి తరపు వాళ్ళు ఏదో అంగట్లో వస్తువును కొనుక్కున్నట్టు బిల్డప్ ఇస్తారు. ఇందులో రెండు కుటుంబాల కలయిక ఎక్కడుంది? ఇదొక డామినేషన్. ఒక మగ అహంకారం. ఒక మనిషి ఐడెంటిటీని (Identity) చట్టబద్ధంగా లాక్కోవడం!
పోనీ... మన దరిద్రమైన సమాజం ఎప్పటినుంచో రాసిపెట్టిన కల్చర్ కదా, మార్చలేం కదా అంటావా?... సరే!
Logic 3: "ప్రేమ కోసం!"
"ఇవన్నీ పక్కన పెట్టండి. పెళ్లి అంటే బేసిక్ గా ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ. ఆ ప్రేమతో పిల్లల్ని కనడం. ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆనందంగా బతకడం" అంటారు. వావ్!
మరి నీ లాజిక్ ప్రకారమే, పెళ్లికి పునాది 'ప్రేమ, ఆనందం' అయినప్పుడు... ఆ ప్రేమ ఎప్పుడైతే చచ్చిపోయిందో, ఆ ఇంట్లో ఎప్పుడైతే ఆనందం పోయిందో, ప్రతిరోజూ యుద్ధం లాగా మారిందో... ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని, "మన మధ్య ప్రేమ లేదు, అనవసరంగా పిల్లల ముందు రోజూ కుక్కల్లా కొట్టుకోవడం దేనికి, వాళ్ళ మెంటల్ హెల్త్ (Mental Health) నాశనం చేయడం దేనికి? ఎవరి దారిన వాళ్ళు ప్రశాంతంగా విడిపోదాం" అని గౌరవంగా విడిపోవాలి కదా? ఆ స్వేచ్ఛ ఉండాలి కదా?
అలా విడిపోతున్నారా? లేరు! ఇంట్లో రోజు మహాభారతం జరుగుతుంది. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే అసహ్యం. ఒకే గదిలో రెండు పక్కల తిరిగి పడుకుంటారు. కానీ బయటకు మాత్రం 'హ్యాపీ కపుల్స్' (Happy Couples). ఎందుకు? విడాకులు తీసుకుంటే 'సొసైటీ ఏమనుకుంటుందో' అన్న భయం! పరువు పోతుందన్న భయం. అంటే... పునాది అయిన ప్రేమ చచ్చిపోయినా సరే, కుళ్ళిపోయిన శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని దాని మీద సెంట్ కొట్టుకుంటూ, ఊరికోసం ఆ శవాన్ని మోస్తున్నారు.
పోనీ... మీకు స్వేచ్ఛగా బతికే దమ్ము లేదు, సొసైటీకి భయపడే పిరికివాళ్లు, అందుకే కాంప్రమైజ్ (Compromise) అయిపోయారు అంటారా?... సరే!
Logic 4: "ఏదో ఒకలా అడ్జస్ట్ అయిపోవాలి సార్!"
ఇక ఫైనల్ గా అంతా అయిపోయాక వచ్చే లాజిక్ ఇది. "ఏం చేస్తాం, తప్పదు. లైఫ్ అంటేనే కాంప్రమైజ్. ఏదో ఒకలా అడ్జస్ట్ (Adjust) అయిపోయి బతికేస్తున్నాం" అంటారు.
మరి అలాంటప్పుడు, నీ బుర్రకంత క్లారిటీ ఉన్నప్పుడు... "నేను ఒక ట్రాప్ (Trap) లో పడ్డాను, నా జీవితం ఒక ఫెయిల్యూర్ (Failure), నేను బకరా అయ్యాను, చచ్చినట్టు adjust అవుతున్నాను" అని నీకు నువ్వు నిజాయితీగా accept చేసి సైలెంట్ గా నీ పని నువ్వు చూసుకోవాలి కదా? కనీసం ఆ నిజాయితీ అయినా ఉండాలి కదా?
ఉన్నారా? లేరు! మీకు అంత సీన్ లేదు. మీరు నాశనం అయిపోవడం కాకుండా... మీ వెనక వచ్చే బ్యాచ్ కి, సింగిల్ గా ఉన్న అబ్బాయిలకి, అమ్మాయిలకి "ఏంట్రా ఇంకా పెళ్లి చేసుకోలేదా? పెళ్లి చేసుకోరా బాబూ జీవితం సెటిల్ (Set) అయిపోద్ది, నా పెళ్ళాం రాకతో, లేపోతే నా మొగుడు రాకతో నా లైఫ్ మారిపోయింది తెలుసా" అని వాళ్ళని కూడా బ్రెయిన్ వాష్ చేసి, fake smile ఇస్తూ, మిమ్మల్ని మీరే సమర్థించుకుంటూ ఈ దరిద్రమైన బురద గుంటలోకి పక్కనోడ్ని కూడా లాగుతున్నారు!
మరెంటైతే?
తోడు కోసం చేసుకున్నారా? లేదు. (డబ్బు, కులం కోసం)
కుటుంబాల కోసం చేసుకున్నారా? లేదు. (ఆధిపత్యం కోసం)
ప్రేమ కోసం చేసుకున్నారా? లేదు. (సొసైటీ భయం కోసం)
పోనీ కనీసం ఫెయిల్ అయ్యాము అన్న నిజాయితీ ఉందా? అది కూడా లేదు. (కవరింగ్ కోసం)
మరి ఏంట్రా ఈ పెళ్లి? ఎందుకు చేసుకుంటున్నట్టు? లాజిక్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నప్పుడు, అసలు వాస్తవం ఏంటి? గుడ్డలూడదీసి నిజం చెబుతున్నా వినండి.
నువ్వు సొంతంగా, స్వేచ్ఛగా బతకలేవు. నీకంటూ ఒక క్యారెక్టర్ లేదు. నీ బ్రెయిన్ కంప్లీట్ గా సొసైటీ కంట్రోల్ లో ఉంది. నువ్వు ఒక మందలో గొర్రెవి. ఆ మంద ఏది చెబితే అది చేయాలి.
నీ మెడలో ఒక హోమ్ లోన్ (Home Loan), పక్కన ఒక పెళ్ళాం/మొగుడు, ఇద్దరు పిల్లలు... నువ్వు ఒక రోబోట్ (Robot) లా ఈ సిస్టమ్ లో ఇరుక్కుపోతేనే ఈ సొసైటీకి హ్యాపీ. మార్కెట్ కి కన్జ్యూమర్స్ (Consumers) దొరుకుతారు. కార్పొరేట్ కంపెనీలకు భయపడే బానిసలు దొరుకుతారు.
అందుకే నిన్ను 'పెళ్లి' అనే ఎర వేసి పట్టుకున్నారు. వయసు రాగానే జరగాల్సిన "అద్భుతం" అని నీ బ్రెయిన్ లో ఫీడ్ చేశారు. నువ్వు ఆ గుర్తింపు కోసం కక్కుర్తి పడి అందులో గుడ్డిగా దూకుతావ్.
సింపుల్ గా చెప్పాలంటే... నువ్వు ఒక బకరావి ఐపోయావ్! నువ్వు వాడుకోబడ్డావు. ఈ సొసైటీ చేతిలో అడ్డంగా బుక్కయ్యావ్. కానీ అది ఒప్పుకునే దమ్ము లేక, నీకు నువ్వే పవిత్రత, ప్రేమ, తోడు అంటూ కధలన్నీ అల్లేసుకుంటుంటావ్.
చైతన్యం Vs మంద బుద్ధి!
ఇదంతా చదివాక "అయితే ఏంటయ్యా నీ ఉద్దేశం? అసలు పెళ్లిళ్లు చేస్కొవొద్దు అంటావా?" అని సంస్కృతి రక్షకులు అరుస్తారు.
నేను పెళ్లి చేసుకోవద్దు అని చెప్పట్లేదు. నా సమస్య పెళ్లితో కాదు. గుడ్డితనంతో! నీ Level of Consciousness పెంచుకో. ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా పరిపూర్ణంగా (Complete) ఫీల్ అవుతావో... అప్పుడు మాత్రమే నువ్వు ఇంకొక మనిషితో రిలేషన్ లోకి వెళ్ళడానికి అర్హుడివి.
ఇంత చెప్పినా కూడా... "లేదు లేదు, నాకెలాగైనా ఆ పెళ్లి పీటల మీద ఒక్కసారైనా కూర్చోవాలని ఉంది, ఎందుకంటే నాకు నా జీవితం కంటే, ఆ పెళ్లి రోజు తీస్కునే ఫొటోలే ముఖ్యం, హల్దీ పేరుతో బుర్ర మీద నీళ్లు ఒంపుకోడమే ముఖ్యం, సంగీత్ పేరుతో వేసే పిచ్చి గంతులే ముఖ్యం, ఆ ఫొటోలన్నీ తీసుకెళ్లి ఇంస్టాగ్రామ్ లో పెట్టేసి, జనాలు లైకులు కొట్టేస్తే, ఏదో సాధించేసినట్టు ఫీల్ ఐపోడమే ముఖ్యం అనుకుంటే, Congratulations, నిన్నా దేవుడు కూడా కాపాడలేడు. వెళ్ళు, వెళ్లి, ఆ పెళ్లి అనే ఊబిలోకి దూకేయ్.. నీ ఖర్మ.
-PRATIKULA VEDAM



Comments
Post a Comment