మీ "మనసులోని మాట" అసలు మీదేనా? | అహంకారం, Ego మరియు Societal Conditioning గురించి ఒక కఠోర సత్యం
The Paradox of "Not Caring" — పట్టించుకోకపోవడం అనే భ్రమ
ముందుగా ఈ ప్రశ్నలోని logical తప్పును పట్టుకుందాం. "ఎవరు ఏమనుకున్నా పర్లేదు... కానీ ఎలా చెప్పాలి?"
మీరు నిజంగానే పట్టించుకోకపోతే, "ఎలా" అనే ప్రశ్నే పుట్టదు. "ఎలా" అని వెతుకుతున్నారు అంటేనే, అది దానికి అర్థం:
ఇది సాధ్యమా? మీరు ఒకరిని కత్తితో పొడవాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకి రక్తం రాకూడదు, నొప్పి తెలియకూడదు అని ఆశిస్తున్నారు. ఇది మీ అహంకారం ఆడుతున్న ఒక దొంగ నాటకం. మీరు సమాజం యొక్క validation కోసం పాకులాడుతున్నారు, కానీ బయటకి మాత్రం ఒక rebel లాగా కనిపించాలని ఆరాటపడుతున్నారు.
పద్ధతి వెతుకుతున్నారంటేనే లోపల భయం రాజ్యమేలుతోందని లెక్క. ఎవరికీ భయపడనివాడు పద్ధతులు వెతకడు — నిజాన్ని ముఖం మీద కొట్టినట్టు చెప్తాడు.Part 02
The Myth of "Your" Mind — మీ మనసులో ఉన్నది మీదేనా?
మీరు ఏదైతే "నా ఆలోచన", "నా అభిప్రాయం" అనుకుంటున్నారో, అది అసలు మీది కాదు. దాన్ని ఒక concrete గా అర్థం చేసుకుందాం.
మీ కోపాలు, మీ అసహనాలు, మీ judgements అన్నీ బయటనుండి అరువు తెచ్చుకున్నవే. మనిషి తన సొంత ఆలోచన అనుకునేది, వందలాది ఇతరుల ఆలోచనల కలగలుపు మాత్రమే. ఇది theory కాదు. మీ ప్రతి strong reaction వెనుక ఒక borrowed belief దాక్కుని ఉంటుంది.
జెన్ కథ — సత్యానికి "ఎలా" అనే పద్ధతి ఉండదు
దీన్ని అర్థం చేసుకోవడానికి Hakuin అనే గొప్ప జెన్ మాస్టర్ జీవితంలో జరిగిన కథను తీసుకుందాం.
హాకుయిన్ ఒక ఊరిలో ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవాడు. ఒక రోజు ఆ ఊరిలో ఒక యువతి గర్భవతి అని తెలిసింది. తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చేసరికి ఆమె, "గుడిలో ఉన్న హాకుయిన్ మాస్టర్ నన్ను మోసం చేశాడు" అని అబద్ధం చెప్పింది.
ఊరు ఊరంతా రగిలిపోయింది. వందలాది మంది వెళ్లి హాకుయిన్ మొహం మీద ఉమ్మేసి, బూతులు తిట్టారు. హాకుయిన్ వాటన్నిటినీ విన్నాడు. ఆయన ఏ సంజాయిషీ ఇవ్వలేదు. ఆయన కేవలం ఒక్క మాట అన్నాడు:
"అలాగా?" — Is that so?
కొన్ని నెలల తర్వాత యువతి బిడ్డకు జన్మనిచ్చింది. జనాలు ఆ పసిబిడ్డను తీసుకొచ్చి హాకుయిన్ ముఖం మీద విసిరికొట్టారు. హాకుయిన్ ఆ బిడ్డను అక్కున చేర్చుకుని, బిక్షాటన చేసి పాలు పడుతూ ఎంతో ప్రేమగా పెంచాడు. ఎవరికీ సంజాయిషీ ఇవ్వలేదు.
ఒక సంవత్సరం తర్వాత యువతి నిజం ఒప్పుకుంది. ఊరు ఊరంతా వచ్చి క్షమాపణలు కోరారు. "స్వామీ, బిడ్డను మాకు ఇచ్చేయండి" అన్నారు. అప్పుడు కూడా హాకుయిన్ ఎలాంటి emotion లేకుండా బిడ్డను వాళ్ళ చేతిలో పెడుతూ అన్నాడు:
"అలాగా?" — Is that so?
భయం యొక్క అనాటమీ — The Anatomy of Fear
గ్రీకు తత్వవేత్త Diogenes ఒక చిన్న మారు మూల ప్రాంతంలో బ్రతికేవాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించి ఆయన దగ్గరికి వచ్చి, "ఏం కావాలి? కోరుకో" అని అడిగితే, Diogenes అన్నాడు:
"నువ్వు నా మీద పడ్తున్న సూర్య రస్మిని అడ్డుకుంటున్నావు, కాస్త పక్కకి జరుగు.అది చాలు నాకు అన్నాడు."
Diogenes అలా ఎలా చెప్పగలిగాడు? ఎందుకంటే ఆయనకు అలెగ్జాండర్ నుండి ఏమీ ఆశించాల్సిన అవసరం లేదు కాబట్టి. హాకుయిన్ కు ఊరి గుర్తింపు అక్కరలేదు. Diogenes కు రాజు approval అక్కరలేదు. వీళ్ళిద్దరూ చెప్పే message ఒక్కటే: మీకు ఎదుటివారి నుండి ఏమైనా కావాలంటే, వాళ్ళని ఎదిరించే శక్తి మీకు ఉండదు.
మీరు ఒక విషయాన్ని చెప్పలేకపోవడానికి కారణం, ఎదుటివారు ఏమనుకుంటారో అన్న భయం కాదు. ఆ భయం వెనుక మీరు ఒక లెక్క వేసుకుంటున్నారు:
- "నేను ఈ మాట చెప్తే, వాళ్ళు నాకు దూరం అవుతారేమో?"
- "నా మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుందేమో?"
- "నాకు వాళ్ళ అవసరం ముందు ముందు ఉంటుందేమో?"
ఇవన్నీ వ్యాపార లెక్కలు. మీరు ఒక వ్యాపారి లాగా ఆలోచిస్తూ, ఒక విప్లవకారుడి లాగా మాట్లాడాలి అనుకుంటున్నారు. బానిసలకే "ఎలా చెప్పాలి" అనే సందేహాలు వస్తాయి. స్వతంత్రుడికి రావు.
Part 05పరిష్కారం — పద్ధతుల్లో కాదు, పరిపక్వతలో ఉంది
దీనికి పరిష్కారం ఏంటి? నేను ఇక్కడ మీకు 5-step guide ఇవ్వను. అది nonsense. నా ఉద్దేశ్యం మీ ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చడం.
"మనసులో ఉన్నది చెప్పడానికి ధైర్యం కావాలి" అని సమాజం చెప్తుంది. కానీ నేను చెప్తున్నాను...
మనసులో ఉన్న చెత్తను విశ్లేషించుకుని, దాన్ని శాంతపరచుకోవడానికి, అసలు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి మరింత గొప్ప ధైర్యం కావాలి.
మీరు ఎదుటివారి అంగీకారం కోసం భిక్షాటన చేయడం ఆపిన క్షణం, మీ గొంతులో వణుకు ఆగిపోతుంది. అప్పుడు మీరు అడగరు "ఎలా చెప్పాలి" అని. మీరు కేవలం చెప్తారు. ఎందుకంటే అప్పుడు మాట్లాడేది మీ అహంకారం కాదు.. మీ ఉనికి (Existence). అది ఎవరికీ భయపడదు. ఎవరికీ తలవంచదు.
-PRATIKULA VEDAM

Comments
Post a Comment